Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా వ్యాక్సినేషన లక్ష్యాన్ని పూర్తి చేయాలి: డీఎంహెచఓ

కళ్యాణదుర్గం, నవంబరు28: కరోనా వ్యాక్సినేషన లక్ష్యాన్ని డిసెంబ రు 5వ తేదీలోగా పూర్తి చేయాలని డీఎంఅండ్‌హెచఓ కామేశ్వరప్రసాద్‌ సూచించారు. ఆదివారం ఆయన వివిధ మండలాలను పర్యటించి ఆసుపత్రులను తనిఖీ చేశారు. వ్యాక్సినేషన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు బాసటగా నిలవాని తెలియజేశారు. కళ్యాణదుర్గం ప్రభు త్వ ఆసుపత్రిలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్త లు సర్వే నిర్వహించి ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన వేయాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


కంబదూరులో...: స్థానిక ప్రభుత్వాస్పత్రిని జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కో వ్యాక్సినేషనపై సి బ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేసి, పూర్తి స్థాయిలో కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియను వేగవంతం చేయాల్సిన బాధ్యత మీపైన వుందన్నారు. మండల ప్రజలకు అందుబాలో వుంటూ వైద్య సేవ లు అందించాలని సూచించారు. 


కుందుర్పిలో...: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం జిల్లా వైద్యాధికారులు కామేశ్వర్‌ ప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కొవిడ్‌ వ్యాక్సిన వేగవంతం చేయాలని డాక్టర్‌ అనుషకు సూచించారు. 


Advertisement
Advertisement