సర్వం సిద్ధం!

ABN , First Publish Date - 2021-01-16T05:23:32+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. జిల్లా కేంద్రంలో మూడు చోట్ల అందించనున్నారు. దే

సర్వం సిద్ధం!
వ్యాక్సిన్‌ తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనాలు



నేడు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం
జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో ప్రక్రియ
ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
(రింగురోడ్డు)

కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. జిల్లా కేంద్రంలో మూడు చోట్ల అందించనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ శనివారం టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విజయనగరం కార్పొరేషన్‌కు సంబంధించి ఘోషాసుపత్రిలో అర్బన్‌ ఫ్యామిలీ హెల్త్‌ సెంటర్‌, రాజీవ్‌నగర్‌ కాలనీ, పూల్‌బాగ్‌ కాలనీల్లో ఉన్న అర్బన్‌హెల్త్‌ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ నిర్వహించనున్నారు. ఘోషాస్పత్రిలో మంత్రి బొత్స సత్యనారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌తో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు. డీఎంహెచ్‌వో ఎస్‌వీ రమణకుమారి పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. వాక్సిన్‌కు సంబంధించి తొలి రోజు 1,500 మందికి టీకా అందించేందుకు నిర్ణయించారు. కరోనా సమయంలో సేవలందించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 17,340 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌ వేసిన తరువాత సంబంధిత వ్యక్తులను కొద్దిరోజుల పాటు పరిశీలనలో ఉంచనున్నారు. ఇందుకు గాను కేంద్రానికి ఒకటి చోప్పున 108 వాహనాలను సిద్ధం చేశారు. సీనియర్‌ వైద్య నిపుణులను పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.  0.5 ఎంఎల్‌ కలిగిన వ్యాక్సిన్‌ను మొదటి డోస్‌గా ఇవ్వనున్నారు. 28 రోజుల తరువాత రెండో డోస్‌ వేయనున్నారు. వ్యాక్సిన్‌ వేసుకునే వ్యక్తి ఆధార్‌కార్డు వెంట తీసుకురావాల్సి వుంటుంది.. కాగా జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో ఇప్పటికే వ్యాక్సిన్‌ తరలించారు. ప్రత్యేక వాహనాలు, సిబ్బంది చేరుకున్నారు. కరోనా వ్యాక్సిన్‌ విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఉత్కంఠతో చూస్తున్నారు.




Updated Date - 2021-01-16T05:23:32+05:30 IST