మృతునికి మొదటి డోసు టీకా... రెండవ డోసుకు రావాలని పిలుపు!

ABN , First Publish Date - 2021-04-11T12:15:18+05:30 IST

హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది.

మృతునికి మొదటి డోసు టీకా... రెండవ డోసుకు రావాలని పిలుపు!

ఫరీదాబాద్: హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఒక వ్యక్తి ఏప్రిల్ 2న మృతి చెందగా, అతనికి ఏప్రిల్ 6న కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ రికార్డులలో నమోదు చేశారు. ఈ ఉదంతం బయటపడగానే ఆరోగ్యశాఖ అధికారుల్లో కలకలం చెలరేగింది. అయితే ఈ ఉదంతంపై ఆరోగ్యశాఖ అధికారులెవరూ వివరణ ఇవ్వలేదు. 




ఢిల్లీకి ఆనుకునివున్న ఫరీదాబాద్‌లో ఉంటున్న కృష్ణాలాల్(64)చనిపోయిన అనంతరం అతనికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు మెసేజ్ వచ్చింది. ఈ సందర్భంగా మృతుని కుమారుడు మాట్లాడుతూ తన తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఏప్రిల్ 2న మృతి చెందారని తెలిపారు. తరువాత అంత్యక్రియలు కూడా నిర్వహించామని తెలిపారు. అయితే ఏప్రిల్ 7న తన తండ్రి మొబైల్ ఫోనుకు... అంతకు ముందు రోజే కరోనా టీకా తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చిందని తెలిపారు. 28 రోజుల తరువాత టీకా రెండవ డోసు టీకా వేస్తామని, అప్పుడు రావాల్సివుంటుందని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై తాను అధికారులకు తెలియజేయగా, పొరపాటున అలా జరిగివుంటుందని వివరణ ఇచ్చారన్నారు.

Updated Date - 2021-04-11T12:15:18+05:30 IST