Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఊరు విడిచి వెళ్లేందుకు సైతం సిద్ధం.. కరోనా టీకా మాత్రం వేసుకోను’

జగిత్యాల : కరోనా టీకా వేసుకోను అంటూ ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. జగిత్యాల జిల్లా మాల్యాలలోని తాటిపల్లిలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీకా వేసుకుంటే ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని అధికారులను సదరు వ్యక్తి నిలదీశాడు. తనకు పేపర్ మీద రాసివ్వాలని కోరాడు. ఊరు విడిచి వెళ్లేందుకు సైతం సిద్ధమని.. కానీ టీకా మాత్రం వేసుకోనని తెగేసి చెప్పాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో టీకా వేయకుండానే సిబ్బంది వెనుదిరిగారు.


Advertisement
Advertisement