కరోనా వ్యాక్సిన్‌ కోసం బారులు

ABN , First Publish Date - 2021-06-14T03:54:43+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఆదివారం ప్రజలు బారులు తీరారు. కూరగాయల విక్రయదారులు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, కిరాణ, మెడికల్‌ షాపులు, ఆటో డ్రైవ ర్లకు వారం రోజులుగా టీకా వేస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్‌ కోసం బారులు
మందమర్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వ్యాక్సిన్‌ కోసం క్యూ

 

మందమర్రిటౌన్‌, జూన్‌ 13 : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఆదివారం ప్రజలు బారులు తీరారు. కూరగాయల విక్రయదారులు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, కిరాణ, మెడికల్‌ షాపులు, ఆటో డ్రైవ ర్లకు వారం రోజులుగా టీకా వేస్తున్నారు. నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి ఆధార్‌కార్డు ద్వారా టోకెన్‌లు ఇచ్చి వ్యాక్సిన్‌ వేశారు. దీపక్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వద్ద  వ్యాక్సిన్‌ కోసం బారులు తీరారు. పట్టణంలో 50 వేల మంది ఉండగా మొదటి డోసు దాదాపు 20 వేల మందికి పూర్తయినట్లు సమాచారం.

ఎస్టీపీపీలో వ్యాక్సిన్‌ సెంటర్‌ ప్రారంభం  

జైపూర్‌: ఎస్టీపీపీలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఆదివారం ఎస్టీపీపీ ఈడీ సంజయ్‌కుమార్‌ షూర్‌, జీఎం పిచ్చయ్యశాస్ర్తిలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఎస్టీపీపీలో పని చేస్తున్న ఉద్యోగుల కోసం వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్క ఉద్యోగి వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. డీజీఎం పర్సనల్‌ నారాయణరావు, సముద్రాల శ్రీనివాస్‌, వైద్యులు రవిందర్‌, శ్యామలా, చుక్కాల శ్రీనివాస్‌, ఎం మొరళి, సురేష్‌లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-14T03:54:43+05:30 IST