అంబులెన్స్‌ చార్జీ.. 7 కిలోమీటర్లకు 8 వేలు!

ABN , First Publish Date - 2020-07-10T07:13:31+05:30 IST

అంబులెన్స్‌లో కిలోమీటరు దూరానికి రూ.1142 వసూలు చేస్తారా ఎక్కడైనా? పుణెలో అంబులెన్స్‌ ప్రొవైడర్‌ ఒకరు వసూలు చేశారు. కరోనా రోగిని ఎక్కించుకొని 7 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రిలో దిగబెట్టినందుకు ఏకంగా...

అంబులెన్స్‌ చార్జీ.. 7 కిలోమీటర్లకు 8 వేలు!

  • పుణెలో కరోనా రోగి నుంచి వసూలు

పుణె, జూలై 9: అంబులెన్స్‌లో కిలోమీటరు దూరానికి రూ.1142 వసూలు చేస్తారా ఎక్కడైనా? పుణెలో అంబులెన్స్‌ ప్రొవైడర్‌ ఒకరు వసూలు చేశారు. కరోనా రోగిని ఎక్కించుకొని 7 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రిలో దిగబెట్టినందుకు ఏకంగా రూ.8వేలు వసూలు చేశాడు. ఓ వ్యక్తి.. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు పుణెలోని సహ్యాద్రి ఆస్పత్రికి వెళ్లాడు. ఫలితాల్లో పాజిటివ్‌ అని రావడంతో తాను దీనానాథ్‌ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని, తనను అక్కడికి తరలించాలని కోరారు. అంబులెన్స్‌లో ఆయన్ను ఎక్కించుకొని 7 కిలోమీటర్ల దూరంలోని దీనానాథ్‌ ఆస్పత్రిలో దిగబెట్టారు. ఇందుకుగాను రోగి నుంచి రూ.8వేలు వసూలు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లడంతో విపత్తు నిర్వహణ చట్టం, మోటారు వాహనాల చట్టం ప్రకారం అంబులెన్స్‌ ప్రొవైడర్‌పై కేసు నమోదు చేశారు. 


Updated Date - 2020-07-10T07:13:31+05:30 IST