మొబైల్‌ విక్రయ కేంద్రాలను ప్రాంభించిన డీసీఎంఎస్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2020-04-03T10:14:07+05:30 IST

కరోనా బాధితుల సహాయార్థం డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు నెల్లూరు నగరంలో రెడ్‌ జోన్లయిన 43, 47 డివిజన్‌లలో ఫలసరకుల మొబైల్‌ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు.

మొబైల్‌ విక్రయ కేంద్రాలను ప్రాంభించిన డీసీఎంఎస్‌ చైర్మన్‌

నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్‌ 2 : కరోనా బాధితుల సహాయార్థం డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు నెల్లూరు నగరంలో రెడ్‌ జోన్లయిన 43, 47 డివిజన్‌లలో ఫలసరకుల మొబైల్‌ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. తొలుత ఈ మొబైల్‌ వ్యాన్‌లను డీసీఎంఎస్‌ కార్యాలయంలో జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరిచలపతిరావు మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో కలెక్టర్‌ ఆదేశాలతో తాము పప్పు ధాన్యాలను మార్కెట్‌ రేటుకే ఇంటి వద్దకే అందిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు మరికొన్ని నిత్యావసర సరకులను అందచేస్తామన్నారు. కరోనా నేధ్యంలో రూ.5 లక్షల విలువైన ఫల సరకులను వివిధ నియోజకవర్గాలలో పేదలకు అందచేయడానికి డీసీఎంఎస్‌ నిర్ణయించిందని త్వరలో అందచేస్తామని వీరి చలపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మేనేజర్‌ వెంకటస్వామి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-03T10:14:07+05:30 IST