తెనుగుబూడిలో చిక్కుకున్న ఛత్తీస్‌గఢ్‌ కూలీలు

ABN , First Publish Date - 2020-04-01T10:20:39+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా జిల్లాలో చిక్కుకుపోయిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన కూలీలకు మండల రెవెన్యూ అధికారులు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

తెనుగుబూడిలో చిక్కుకున్న ఛత్తీస్‌గఢ్‌ కూలీలు

భోజనానికి సైతం డబ్బులు లేక ఇబ్బందులు

స్పందించిన తహసీల్దార్‌... భోజన, వసతి ఏర్పాట్లు


దేవరాపల్లి: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా జిల్లాలో చిక్కుకుపోయిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన కూలీలకు మండల రెవెన్యూ అధికారులు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కూలి పనుల కోసం ఛత్తీస్‌గఢ్‌లోన జానగిరి జిల్లా బిర్రా గ్రామానికి  చెందిన 34 కుటుంబాల వారు మూడు నెలల క్రితం జిల్లాకు వచ్చారు. వీరిలో 15 కుటుంబాల వారు చోడవరం ప్రాంతంలో, తొమ్మిది కుటుంబాలకు వారు మండలంలోని తెనుగుపూడిలో వుంటున్నారు.


ఇక్కడ వుంటున్న వారిలో మూడు కుటుంబాలు ఇటీవల స్వగ్రామానికి వెళ్లిపోయాయి. లాక్‌ డౌన్‌ కారణంగా  మిగిలిన కుటుంబాల వారు వెళ్లలేకపోయారు. వీరిలో ముగ్గురు వృద్ధులు, ఆరుగురు పదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో అన్నం లేక పస్తులు వుంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేకర్లు తహసీల్దార్‌ జె.రమేశ్‌బాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి భోజన ఏర్పాట్లు చేశారు. లాక్‌ డౌన్‌ సడలించే వరకు ఇక్కడే వసతి, భోజన ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్‌ చెప్పారు.

Updated Date - 2020-04-01T10:20:39+05:30 IST