కరోనా నివారణ చర్యల్లో ‘రామ్‌కో’

ABN , First Publish Date - 2020-04-04T12:04:26+05:30 IST

కరోనా నివారణ చర్యల్లో ‘రామ్‌కో’

కరోనా నివారణ చర్యల్లో ‘రామ్‌కో’

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సామా జిక బాధ్యతగా తమ సంస్థ స్వచ్ఛందంగా కరోనా నిరోధక చర్య లు చేపడుతోం దని రామ్‌కో సిమెంట్స్‌ ప్రక టించింది. తమిళ నాడు సహా దేశవ్యా ప్తంగా రామ్‌కో కార్య కలాపాలు నిర్వహిస్తు న్న కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, బెంగాళ్‌, ఒడిషా రాష్ట్రా ల్లోను కొవిడ్‌-19 అరికట్టేందుకు ప్రభుత్వ యం త్రాం గాలతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమి ళనాడు విషయాని కొస్తే.. వైద్య పరికరాలు సమ కూ ర్చడం, మదురైకి 200 కి.మీ. దూరంలోని కడుకూర్‌, తామరైకుళంలో ఐసోలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, పం చాయతీలు, ప్రజారోగ్యశాఖల అధికారులు, సిబ్బందికి స్టీల్‌ మంచాలు సమకూర్చింది. ఇంకా సమీప గ్రామాల్లో పేద ప్రజలకు, అంతరరాష్ట్ర కార్మికులకు అవసరమైన నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు కూడా అందజేసినట్లు ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-04-04T12:04:26+05:30 IST