Abn logo
Apr 4 2020 @ 06:36AM

‘144’ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు

చెన్నై: ‘కరోనా’ వైర్‌సను అడ్డుకొనేందుకు రాష్ట్రప్రభుత్వం విధించిన 144 సెక్షన్‌ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలుశిక్ష తప్పదని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ హెచ్చరించారు. అడయార్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ, ప్రకృతి వైపరీత్యాల నిరోధక చట్టం 2005 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారికి కఠిన శిక్ష లు విధించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. భౌతిక దూరం పాటించాలని 9 రోజులుగా ప్రభుత్వం చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  కొద్దిరోజుల క్రితం 10 కరోనా కేసులుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 400 దాటడం ఆందోళన కలిగించే విషయమన్నారు. వైరస్‌ బారిన పడకుండా నిర్లక్ష్యంగా ప్రజలు వ్యవహరిస్తున్నారని, విధిలేని పరిస్థితుల్లో వారిపై చర్యలు చేపట్టాల్సి వస్తోందని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement