నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-04-09T09:11:58+05:30 IST

నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌

నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌

‘కరోనా’ వైద్యులకు తగిన పరికరాల్లేవన్న ఫలితం!

పోలీసు కేసు కూడా నమోదు

దళితుడినైన నాపై అన్యాయంగా చర్య: సుధాకర్‌


నర్సీపట్నం, విశాఖపట్నం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు, సి బ్బందికి తగిన పరికరాలు అందించడం లేదంటూ ఆ రోపణలు చేసిన వైద్యుడు కె.సుధాకర్‌ను ప్రభుత్వం స స్పెండ్‌ చేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎనస్థీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కె.సుధాకర్‌ సోమవారం మీడియాతో మాట్లాడు తూ కరోనా వైరస్‌ బారినపడిన, అనుమానిత లక్షణాలున్న వారికి సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి సరిపడా పరికరాలను అందించడం లేదని, వారి ఇబ్బందులను ప్రభుత్వంపట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా కలెక్టర్‌ వినయచంద్‌ నియమించిన ముగ్గురు అధికారుల(కేజీహెచ్‌ సూపరింటెండెం ట్‌, డీఆర్‌డీఏ పీడీ, నర్సీపట్నం ఆర్డీ వో) బృందం మంగళవారం ప్రాంతీ య ఆస్పత్రిలో విచారణ నిర్వహించిం ది. ఆ బృందం అందజేసిన నివేదికను కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపగా, డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ మంగళవా రం ఉత్తర్వులు జారీ చేశారని ప్రాం తీయ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణి బుధవారం తె లిపారు. మరోవైపు సుధాకర్‌పై పట్టణ పోలీసులు బు ధవారం కేసు నమోదు చేశారు. ఆయన ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడారంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నీలవేణి ఫిర్యాదు చేశారు. కాగా, తన వ్యాఖ్యలపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని డాక్టర్‌ కె.సుధాకర్‌ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘నర్సీపట్నం ఆస్పత్రిలో పరిస్థితిపై నేను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి మాస్క్‌లు ఇవ్వకుండా స్థానిక నాయకులకు, పోలీసు అధికారులకు ఎందుకు? మాస్క్‌లు ఇవ్వనప్పుడు ప్రాణాలను ఫ ణంగా పెట్టి పనిచేయాల్సిన అవసరం లేదనే సెలవు అడిగాను. వైద్యులకు అ వసరమైన మాస్క్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజ సం? మీడియా నాతో వస్తే వాస్తవాలు చూపిస్తా. ఆస్పత్రిలోని పరిస్థితి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దామని ఆయన ఇంటికి వెళ్లి గంట కూర్చున్నా. ఆయన అందుబాటులో లేకపోవడంతో తిరిగి వచ్చేశా. వాస్తవాలు బయటకు చెప్పినందుకు దళితుడినైన నన్ను సస్పెండ్‌ చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-04-09T09:11:58+05:30 IST