స్వీయ నియంత్రణతోనే కరోనాపై విజయం!: డీజీపీ

ABN , First Publish Date - 2020-04-09T09:30:40+05:30 IST

స్వీయ నియంత్రణతోనే కరోనాపై విజయం!: డీజీపీ

స్వీయ నియంత్రణతోనే కరోనాపై విజయం!: డీజీపీ

గుంటూరు, ఏప్రిల్‌ 8: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైర్‌సపై జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా విజయం సాధిస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. బుధవారం ఆయన గుంటూరులోని రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులు, డీఎస్పీలతో సమావేశమై కరోనా వైర్‌స నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, త్వరలోనే ఈ వైరస్‌ చైన్‌ను తెంచేస్తామని, అందుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.  

Updated Date - 2020-04-09T09:30:40+05:30 IST