విరాళాలన్నింటినీ సీఎంఆర్‌ఎఫ్‌లో డిపాజిట్‌ చేయండి

ABN , First Publish Date - 2020-04-09T09:37:14+05:30 IST

విరాళాలన్నింటినీ సీఎంఆర్‌ఎఫ్‌లో డిపాజిట్‌ చేయండి

విరాళాలన్నింటినీ సీఎంఆర్‌ఎఫ్‌లో డిపాజిట్‌ చేయండి

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘‘జిల్లాల్లో వివిధ రూపాల్లో కలెక్టర్లకు అందుతోన్న విరాళాలను ఇతర అవసరాలకు దారి మళ్లించవద్దు. విధిగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)లో డిపాజిట్‌ చేయాలి. రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నిధులను  సహాయచర్యలకు ఉపయోగించుకోండి’’ అంటూ ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై కలెక్టర్లు పెదవి విరుస్తున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు న్నది వాస్తవమే అయినా వాటి వినియోగానికి అనేక ఆంక్షలు, పరిమితులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

Updated Date - 2020-04-09T09:37:14+05:30 IST