రోడ్డెక్కిన కోవిడ్ బాధితులు

ABN , First Publish Date - 2020-08-13T07:13:15+05:30 IST

రోడ్డెక్కిన కోవిడ్ బాధితులు

రోడ్డెక్కిన కోవిడ్ బాధితులు

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 12: కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా కొవిడ్‌ ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ కరోనా బాధితులు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం బళ్లారి రోడ్డుపై గంటసేపు రోడ్డుపై బైఠాయించి ఆస్పత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్పత్రిలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని, మరుగుదొడ్లు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోందని ఆరోపించారు. తమకు మెరుగైన చికిత్స అందడంలేదని, వైద్యులు రెగ్యులర్‌గా వచ్చి మందులు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఆహారం బాగుండటం లేదని, తమను హోం క్వారంటైన్‌కు పంపాలని కోరారు. దాదాపు గంటసేపు బాధితులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-08-13T07:13:15+05:30 IST