Abn logo
Mar 27 2020 @ 00:21AM

ఇళ్ల అమ్మకాలు ఢమాల్‌

హైదరాబాద్‌లో 50 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ స్థిరాస్తి రంగాన్నీ దెబ్బతీస్తోంది. ఈ మహమ్మారితో ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 42 శాతం తగ్గా యి. హైదరాబాద్‌లో అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయాయి. దేశంలోని మరే నగరంలోనూ అమ్మకాలు ఈ స్థాయిలో పడిపోలేదు. స్థిరాస్తి రంగం తీరుతెన్నులను పరిశీలించే బ్రోకరేజీ  సంస్థ ‘అనరాక్‌’ తన తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది. 


2019 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంతో పోల్చితే 2020 జనవరి-మార్చి త్రైమాసికంలో ఏడు ప్రధాన నగరాల్లో నివాల గృహాల అమ్మకాలు 24 శాతం తగ్గాయి. ఉన్న ప్రాజెక్టులే అమ్ముడుపోక పోవడంతో చాలా మంది బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నట్టు అనరాక్‌ తెలిపింది. కాగా, ఢిల్లీలో 41 శాతం, ముంబై, పుణెల్లో 42 శాతం, బెంగళూరులో 45 శాతం, చెన్నైలో 36 శాతం అమ్మకాలు తగ్గాయి.

Advertisement
Advertisement
Advertisement