ఏపీలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-04-10T02:40:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం కొత్తగా 15 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.

ఏపీలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే కొత్తగా 15 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం మొత్తం 363 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ప్రకాశం జిల్లాలో గురువారం ఒక్కరోజే 11 కరోనా కేసులు నమోదయ్యాయి.

గుంటూరులో 2 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 1 కరోనా కేసు, కడపలో 1 కరోనా కేసు నమోదైంది. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 10 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. కరోనా వల్ల ఇవాళ అనంతపురం, గుంటూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 6 మంది చనిపోయారని ఏపీ కోవిడ్-19 నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు. 


తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 12 మంది మృతి చెందారు. కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్  ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించింది.

Updated Date - 2020-04-10T02:40:26+05:30 IST