కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2020-04-05T22:15:53+05:30 IST

కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షాసమావేశానికి సీఎస్‌, డీజీపీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. లక్షణాలతో ఎవరు వచ్చినా కరోనా పేషెంట్‌గానే భావించి వైద్యసిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని సీఎం జగన్ అన్నారు. ఢిల్లీలో జమాత్‌కు వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు వీలైనంత వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి జిల్లాలో టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని కూడా పెంచాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతర సర్వే జరపాలని, ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు.

Updated Date - 2020-04-05T22:15:53+05:30 IST