ఏపీలో కరోనా తగ్గినట్లుగానే.. తగ్గి మళ్లీ..

ABN , First Publish Date - 2020-11-23T00:19:48+05:30 IST

ఏపీలో కరోనా తగ్గినట్లుగానే.. తగ్గి మళ్లీ..

ఏపీలో కరోనా తగ్గినట్లుగానే.. తగ్గి మళ్లీ..

గుంటూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గత నెల నుంచి రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలో స్వల్పంగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారంలో ఏపీలో కొత్తగా 1,121 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వైరస్ వల్ల ఇవాళ 11 మంది మృతి చెందారు. ఏపీలో 8,62,231 కరోనా కేసులు నమోదవగా, కరోనా వల్ల ఇప్పటి వరకు 6,938 మంది చనిపోయారు.


ప్రస్తుతం 14,249 మందికి కరోనా చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 8,41,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 96.15 లక్షల కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు వైద్య శాఖ పేర్కొంది.

Updated Date - 2020-11-23T00:19:48+05:30 IST