మృత్యు పాచిక?

ABN , First Publish Date - 2020-03-23T07:29:45+05:30 IST

కరోనా వైరస్‌ చైనా పనే అని అమెరికా.. అమెరికా నుంచే మాకు వచ్చిందని చైనా ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో ఆసక్తికరమైన విశ్లేషణ ముందుకొచ్చింది..

మృత్యు పాచిక?

  • విదేశీ పెట్టుబడిదారులను పంపించే కుట్ర
  • వైరస్‌ను సృష్టించి.. ఏమీ చేయలేమని చేతులెత్తేశారు
  • భయంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాలు అమ్ముకున్నారు
  • సరికొత్త వాదనలతో ముందుకొస్తున్న విశ్లేషకులు
  • సమర్థిస్తున్న యూరప్‌, అమెరికా పారిశ్రామికవేత్తలు
  • చైనా ముందే టీకా తయారు చేసిందన్న అనుమానాలు

న్యూఢిల్లీ, మార్చి 22: కరోనా వైరస్‌ చైనా పనే అని అమెరికా.. అమెరికా నుంచే మాకు వచ్చిందని చైనా ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో ఆసక్తికరమైన విశ్లేషణ ముందుకొచ్చింది. ఆర్థిక మాంద్యం లో ఉన్న చైనా తమ దేశంలో ఉన్న విదేశీ పెట్టుబడిదారులను వట్టి చేతులతో పంపించడమే లక్ష్యంగా కరోనా నాటకం ఆడిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వాదనను అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన ఆంత్రప్రెన్యూర్లు సమర్థిస్తున్నారు. విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి.. కరోనా కల్లోలానికి ముందు చైనాలోని ప్రముఖ రసాయన, సాంకేతిక పరిశ్రమల్లో అమెరికా, యూర్‌పకు చెందినవారి పెట్టుబడులే అధికంగా ఉండేవి.


దీంతో ఆయా కంపెనీల లాభాల్లో సగానికి పైగా వారికే వెళ్లేవి. ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగేది. ఈ గ్లోబల్‌ ఎకానమీలో ఎవరినీ తమ దేశం నుంచి  వెళ్లగొట్టలేని పరిస్థితి. అందుకే చైనా పొగబెట్టాలనుకుంది. కేవలం వూహాన్‌కే పరిమితమయ్యేలా వైర్‌సను సృష్టించింది. కానీ తాము ఆ వైర్‌సను నియంత్రించలేమని ప్రకటించింది. ఓ పిశాచంతో యుద్ధం చేస్తున్నామంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలు అక్కడి పారిశ్రామిక రంగంపై అనుమానాలను పెంచాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు వాటాలను అమ్ముకొని చైనా నుంచి బయటకు వచ్చేశారు. ఫలితంగా రెండు రోజుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థలో రూ.1.50లక్షల కోట్ల సంపద వచ్చి చేరింది. తద్వారా చైనా వైరస్‌ పాచిక పారింది. 


టీకాను చైనా ముందే తయారు చేసిందా..?

కరోనా వైర్‌సకు టీకాను చైనా ముందే తయారు చేసిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి విశ్లేషకులు చైనాలో కరోనా పాజిటివ్‌ కేసులు, రికవరీ కేసుల సంఖ్యను సాక్షాలుగా చూపిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన చైనాలో ఇప్పటి వరకు మొత్తం 81వేలకు పైగా కరోనా కేసులు నమోదైతే అందులో 72,440 కేసులు రికవరీ అయ్యాయి. ఇటలీలో మొత్తం 53 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయితే 6,072 కేసులే రికవరీ అయ్యాయి. వైరస్‌ ప్రారంభమైన చైనాలోనే భారీ సంఖ్యలో కేసులు రికవరీ కావడం చూస్తుంటే ఆదేశం ఇప్పటికే టీకాను కనుగొని ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే చైనాలో కొత్తగా కేసులు నమోదు కావడం లేదని చెబుతున్నారు.  


కరోనా అమెరికా కుట్రనే : ఇరాన్‌

కరోనాపై యుద్ధంలో భాగంగా అమెరికా ప్రకటించిన వైద్య సాయాన్ని ఇరాన్‌ తిరస్కరించింది. వైరస్‌ పుట్టుక వెనుక అమెరికా కుట్ర ఉందన్న చైనా వాదనను సమర్థించింది. పర్షియన్ల కొత్త సంవత్సరం నౌరుజ్‌ సందర్భంగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో వైర్‌సను మరింత వ్యాపింపజేయడానికే అమెరికా వైద్య సాయం ప్రకటించి ఉండొచ్చన్నారు.  


చైనా రహస్యంగా ఉంచింది: ట్రంప్‌ 

చైనాలో కరోనా వైరస్‌ ప్రబలిన సమాచారాన్ని చెప్పకుండా ఆ దేశం చాలా రహస్యంగా వ్యవహరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. ముంచుకొస్తున్న ముప్పు గురించి చైనా ముందుగా హెచ్చరించి ఉంటే అమెరికా, ఇతర దేశాలు మరింత జాగ్రత్తపడేవన్నారు.  


కావాలనే మాపై నిందలు: చైనా

అమెరికానే చైనాకు కరోనా వైర్‌సను తీసుకొచ్చి ఇప్పుడు తమ పైనే నిందలు వేస్తున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్‌ సువాంగ్‌ ఆరోపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణలో చైనా చేస్తున్న కృషిని, చైనా ప్రజల త్యాగాలను తక్కువ చేయడమేనని అన్నారు.  

Updated Date - 2020-03-23T07:29:45+05:30 IST