డెల్టా ప్ల‌స్ గుట్టు తెలిసింది... ఆందోళ‌న పడొద్దు: శాస్త్ర‌వేత్త‌లు

ABN , First Publish Date - 2021-06-15T11:37:01+05:30 IST

కరోనా వైర‌స్ తీవ్ర వ్యాప్తికి కార‌ణ‌మైన‌...

డెల్టా ప్ల‌స్ గుట్టు తెలిసింది... ఆందోళ‌న పడొద్దు: శాస్త్ర‌వేత్త‌లు

న్యూఢిల్లీ: కరోనా వైర‌స్ తీవ్ర వ్యాప్తికి కార‌ణ‌మైన‌ డెల్టా వేరియంట్ మార్పుచెంది, డెల్టా ప్లస్ లేదా  ఏవై 1గా  కొత్త రూపం సంత‌రించుకుంది. అయితే ప్ర‌స్తుతానికి దేశంలో ఇది చాలా త‌క్కువ‌గానే క‌నిపిస్తోంద‌ని, దీని గురించి ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  వైర‌స్‌కు సంబంధించిన డెల్డా లేదా బీ.1.617.2 వేరియంట్‌లో ఉత్ప‌రివ‌ర్త‌నం చెందిన కార‌ణంగా డెల్టా ప్లస్ వేరియంట్ రూపుదిద్దుకుంది. దీనిని భార‌తేశంలో గుర్తించారు. 


ఇదే మహమ్మారి సెకెండ్ వేవ్‌కు కార‌ణంగా నిలిచింది. వైరస్ కొత్త వేరియంట్ వల్ల ఈ వ్యాధి ఎంత తీవ్ర‌స్థాయికి చేరుకుంటుంద‌నే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో తెలియ‌న‌ప్ప‌టికీ, ఇటీవల భారతదేశంలో ఆమోదం పొందిన‌ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్సతో డెల్టా వేరియంట్‌ను అడ్డుకోవ‌చ్చు. ఢిల్లీలోని సీఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)కి చెందిన‌ శాస్త్రవేత్త వినోద్ స్కారియా ఒక‌ ట్వీట్ ద్వారా దీనికి సంబంధించిన విష‌యాలు తెలియ‌జేశారు.  కే417ఎన్‌ మ్యుటేషన్ బీ1.617.2 వేరియంట్‌కు కారణంగా నిలుస్తోంది. దీనిని ఏఐ.1 అని కూడా అంటారు. ఈ మ్యుటేషన్ సార్స్‌-కోవ్‌-2లో సంభవించిందని, ఇది శ‌రీరంలోని కణాలకు వైర‌స్ చొచ్చుకుపోయేలా చేసి, వ్యాధిని వ్యాపింప‌ చేసేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.  అయితే భారతదేశంలో కె 417 ఎన్ వేరియంట్ అంత‌గా కనిపించ‌డం లేద‌ని, ఎక్కువగా యూరప్, అమెరికాలో క‌నిపిస్తున్న‌ద‌న్నారు. 

Updated Date - 2021-06-15T11:37:01+05:30 IST