రూ.100లకే 12 రకాల కాయగూరలు

ABN , First Publish Date - 2020-04-04T12:09:44+05:30 IST

రూ.100లకే 12 రకాల కాయగూరలు

రూ.100లకే 12 రకాల కాయగూరలు

చెన్నై: ప్రజల సౌకర్యార్ధం ప్రతి ఇంటికి చేరే విధంగా రూ.100లతో కూడిన కాయగూరల ప్యాకేజ్‌ పంపిణీని మంత్రి ఎస్పీ వేలుమణి శుక్రవారం ప్రారంభించారు. కోయంబత్తూర్‌ మార్కెట్‌లో ప్రజల రద్దీ తగ్గించేందుకు రూ.100లకే 12 రకాల కాయగూరల ప్యాకేజ్‌ పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి ఎస్పీ వేలుమణి పాల్గొని ప్రజలకు ఈ ప్యాకేజ్‌ పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కోవై కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాంతాల్లో వ్యాన్ల ద్వారా ఈ ప్యాకేజ్‌లను ప్రజల ఇళ్ల వద్దకు వస్తాయన్నారు. మరో ప్యాకేజ్‌ రూ.100కు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-04-04T12:09:44+05:30 IST