Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీర్యంలో వైరస్‌ లేదు!

ఆంధ్రజ్యోతి(28-04-2020)

ఎబోలా, జికా వైర్‌సల మాదిరి కరోనా వైరస్‌ కూడా వీర్యం ద్వారా ఇతరులకు సోకే వీలు ఉందా? ఈ కోణంలో జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే....


ఎబోలా, జికా వైర్‌సలు వీర్యం ఆధారంగా ఇతరులకు సోకుతాయి. కరోనా వైరస్‌ కూడా ఇలా సోకే వీలుందా? అనే కోణంలో పలు పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం కరోనా స్వల్పంగా, తీవ్రంగా సోకిన చైనాకు చెందిన 34 మంది వేర్వేరు పురుషుల నుంచి సేకరించిన వీర్యాన్ని పరీక్షించారు. ఆ పరీక్షలో వీర్యంలో కరోనా వైరస్‌ కనిపించలేదు. ఈ పరిశోధనా ఫలితం ఎంతో ఊరటను ఇచ్చింది. ఒకవేళ ఈ వైర్‌సకు పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలోకి చొరబడే సామర్థ్యం  ఉండి ఉంటే, ఆ వ్యవస్థ పనితీరు దెబ్బతిని, తిరిగి సరిదిద్దలేని నష్టం జరిగేదని పరిశోధకులు అంటున్నారు. అయితే వీర్యంలో ఈ వైరస్‌ కనిపించనంత మాత్రాన, వైరస్‌ వృషణాల్లోకి ప్రవేశించే వీలు లేదని చెప్పడానికి వీలు లేదట! అమెరికా, చైనాకు చెందిన పరిశోధకులు జరిపిన ఈ పరిశోధన వివరాలు జర్నల్‌ ఆఫ్‌ ఫెర్టిలిటీ అండ్‌ స్టెరిలిటీలో ప్రచురితమయ్యాయి. ఒకవేళ వృషణాల్లోకి ఈ వైరస్‌ ప్రవేశిస్తే వీర్యంతో పాటు, వీర్య ఉత్పత్తి మీద కూడా ప్రభావం పడుతుందని వారంటున్నారు.

Advertisement
Advertisement