కరోనా వైరస్‌పై అపోహలకు పోవద్దు

ABN , First Publish Date - 2020-04-05T10:07:20+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌పై ప్రజానీకం ఎలాంటి అపోహలకు పోకుండా గృహనిర్బంధం ద్వారానే దానిని అరికట్టవచ్చని కలె క్టర్‌ పోలా భాస్కర్‌ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై అపోహలకు పోవద్దు

స్వీయనియంత్రణతోనే కట్టడి

జిల్లాలో కమ్యూనిటీ సర్వెలింగ్‌ సర్వే

కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్లడి


ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 4 : జిల్లాలో కరోనా వైరస్‌పై ప్రజానీకం ఎలాంటి అపోహలకు పోకుండా గృహనిర్బంధం ద్వారానే దానిని అరికట్టవచ్చని కలె క్టర్‌ పోలా భాస్కర్‌ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 18 క రోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వచ్చాయని తెలిపారు. ఒంగోలులో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మిగిలినవి చీరాల, కనిగిరి, చీమకుర్తి, కుం కులమర్రు గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు నమోద య్యాయని ఆయన చెప్పారు. జిల్లా అధికార యం త్రాంగం అన్ని విఽధాలుగా చర్యలు చేపట్టిందని తెలి పారు. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులన్నీ ఢిల్లీకి సంబంధించిన కేసులే అధికంగా ఉన్నాయని కలెక్టర్‌ వెల్లడించారు. అటువంటి వారందరినీ గుర్తిం చి ఇప్పటికే క్వారంటైన్‌ కేంద్రాలకు చేర్చడం జరిగిం దన్నారు.


అటువంటి వారిలో కూడా కొంత మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేయిస్తామని తెలి పారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా కంటోన్మెంట్‌ ప్లా న్‌ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్ల డించారు. జిల్లావ్యాప్తంగా ప్రజానీకం స్వీయనియం త్రణలో ఉండి కరోనా వైరస్‌ను నియంత్రించుకో వాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగాకుండా జిల్లా వ్యాప్తంగా కమ్యూనిటీ సర్వెలింగ్‌ సర్వేను చేపడు తున్నట్లు వివరించారు. ప్రభుత్వం మొబైల్‌ ఫోన్‌లో ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించిందని,  అందులో ఈ సర్వే బృందాలు వివరాలు నమోదు చేస్తాయని తెలిపారు. అందులో ఏమైనా అనుమానాలు ఉంటే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా రంగాల్లో పనులు చే సుకునేందుకు అవకాశం కల్పించామని, అయితే కూ లీలు భౌతికదూరం పాటించాలని సూచించారు.

Updated Date - 2020-04-05T10:07:20+05:30 IST