50 ఇళ్ల అద్దెను మాఫీ చేసిన యజమాని

ABN , First Publish Date - 2020-03-30T17:47:40+05:30 IST

కరోనా మహమ్మారి మనిషిలోని మానవత్వానికి పరీక్ష పెడుతోంది. ఈ క్లిష్ట సమయంలో వైద్యులు, నర్సులు, రవాణా కార్మికులు ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నారు. అర్హులకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు యూపీలోని...

50 ఇళ్ల అద్దెను మాఫీ చేసిన యజమాని

లక్నో: కరోనా మహమ్మారి మనిషిలోని మానవత్వానికి పరీక్ష పెడుతోంది. ఈ క్లిష్ట సమయంలో వైద్యులు, నర్సులు, రవాణా కార్మికులు ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నారు. అర్హులకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు యూపీలోని నోయిడాకు చెందిన ఇంటి యజమాని తన ఉదారత చాటాడు. 50 మంది అద్దెను మాఫీ చేయడమే కాకుండా, ఇంటిని విడిచిపెట్టి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశాడు. కుశాల్ పాల్ అనే యజమాని తనకు గల ఇళ్లలో అద్దెకు ఉంటున్నవారికి రేషన్ కూడా ఇస్తున్నాడు. నోయిడాలో ఇప్పటివరకు 32 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న బీహార్-జార్ఖండ్, యూపీలకు చెందినవారు తమ గ్రామాలకు వెళ్లిపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆహారం, పానీయాలు  దొరక్కపోవచ్చని ఆందోళన చెందుతూ  నగరం విడిచి వెళుతున్నారు.

Updated Date - 2020-03-30T17:47:40+05:30 IST