గాలి ద్వారా కరోనా వాప్తి!

ABN , First Publish Date - 2020-07-10T00:55:57+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఈ వైరస్....

గాలి ద్వారా కరోనా వాప్తి!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్.. గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. కరోనా రోగి తుమ్మినా, దగ్గినా అతి సూక్ష్మరేణువులు గాలిలో కొన్ని గంటలపాటు ఉంటాయని అంటున్నారు. రద్దీ ప్రాంతాలు, గాలి తక్కువగా వీచే ప్రాంతాల్లో గాలి ద్వారా వైరస్ సోకే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గాలిని శుద్ధి చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని సూచిస్తున్నారు. అప్పుడే కరోనాను కట్టడి చేయొచ్చని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. 


కరోనా వైరస్ మనిషి బాడీలో రెండు స్టేజీల్లో పని చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. మొదటి స్టేజ్‌లోనే చికిత్స అందిస్తే రోగం నయం అవుతుందంటున్నారు. కరోనా వైరస్ బాడీలోని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయని అలాంటి వారిలో కరోనా వైరస్ ప్రభావం చాలా చాలా తీవ్రత ఉంటుందని.. ఆ సమయంలో రోగి చనిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. 




Updated Date - 2020-07-10T00:55:57+05:30 IST