కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు

ABN , First Publish Date - 2020-04-09T09:05:46+05:30 IST

కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు

కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు

విజయవాడ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): దేశంలోని 10 రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు, ఇక్కడి కూలీలు సుమారు 8,153 మంది చిక్కుకున్నారని కొవిడ్‌- 19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు చెప్పారు. విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. వారి బాగోగుల కోసం ఎప్పటికప్పుడు అధికారులు ఆయా రాష్ట్రాల అధికారులతో స ంప్రదింపులు జరుపుతున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు 6 వేలమంది గుజరాత్‌లో చిక్కుకుపోవడంతో మత్స్యకార సంఘాలకు చెందిన నలుగురు ప్రతినిధులను అక్కడికి పంపించామన్నారు. తమిళనాడులోని పునరావాస కేంద్రాల్లో ఉన్న 1,412 మంది ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర సీఎంను ప్రభుత్వం కోరిందన్నారు. 

Updated Date - 2020-04-09T09:05:46+05:30 IST