ఆ కరోనా వారియర్ ఫొటో వైరల్!
ABN , First Publish Date - 2020-05-20T13:25:23+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో కరోనా వారియర్స్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను కాపాడే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటున్నారు. కరోనా...
ధార్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో కరోనా వారియర్స్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను కాపాడే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటున్నారు. కరోనా వారియర్స్‌లో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో పాటు పోలీసులు, పరిపాలనా అధికారులు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని ధార్ కలెక్టర్ శ్రీకాంత్ బానోట్‌కు చెందిన ఒక ఫొటో వైరల్‌గా మారింది. శ్రీకాంత్ బాధ్యతల మధ్య తన పిల్లలను కలుసుకునేందుకు ఇంటికి వస్తుంటారు. అటువంటప్పుడు ఇంటి బయటనే కూర్చుని కిటికీలోనుంచి తన పిల్లలతో మాట్లాడుతుంటారు. శ్రీకాంత్ తన బాధ్యతల రీత్యా రోజులో చాలా ప్రదేశాలు తిరుగుతుంటారు. పలువురిని కలుస్తుంటారు. అందుకే ఆయన తన పిల్లలను దూరం నుంచే పలుకరిస్తుంటారు. కాగా శ్రీకాంత్ భార్య కృష్ణ బానోట్ పోలీసు అధికారిణి. ప్రస్తుతం దేవాస్‌లో ఎస్పీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.