కరోనాదడ

ABN , First Publish Date - 2022-01-23T06:20:17+05:30 IST

జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1379 మంది మహమ్మారి బారిన పడినట్లు అధికారులు శనివారం వెల్లడించారు.

కరోనాదడ

ఒక్కరోజులో 1379 మందికి వైరస్‌

అనంతపురం వైద్యం, జనవరి22: జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1379 మంది మహమ్మారి బారిన పడినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 165123కి పెరిగింది. ఇందులో  158 649 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1093 మంది మరణించగా.. ప్రస్తుతం 5381 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


టెన్షన పుట్టిస్తున్న  పాజిటివిటీ రేటు

జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు టెన్షన పుట్టిస్తోంది. ఈనెల ఆరంభంలో రోజుకు 20లోపే పాజిటివ్‌ కేసు లు ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 1379 కేసులు న మోదయ్యాయి. దీన్ని బట్టి అనంతలో థర్డ్‌వేవ్‌ ఏ స్థాయిలో కల్లోలం సృష్టిస్తోందో అర్థమవుతోంది. కరో నా బాధితులకు చికిత్స అందించేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 15 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 190 మందికి చికిత్సలు అందించేందుకు వసతులు కల్పించారు. పెనుకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, రామగిరి, ఉరవకొండ, హిందూపురం, బుక్కరాయసముద్రం, తాడిప త్రి అనంతపురం, మడకశిరలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, 2190 పడకల వసతులు కల్పించినట్లు కలెక్టర్‌, డీఎంహెచఓ చెబుతున్నారు. ఒక్కో కేర్‌ సెంటర్‌కు నోడల్‌ ఆఫీసర్‌ను నియమించారు.


ఎస్కేయూలో పదిమందికి పాజిటివ్‌?

అనంతపురం అర్బన, జనవరి 22: ఎస్కేయూలో కొవిడ్‌ కలకలం రేపుతోంది. తాజాగా నిర్వహించిన వేమన జయంతి వేడుకల అనంతరం వీసీ కరోనా లక్షణాలతో బాధపడుతూ పరీక్షలు చేయించుకున్నారు. కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. రిజిస్ర్టార్‌ కూడా కరోనా బారినపడ్డారు. వీరిద్దరు ప్రస్తుతం కొవిడ్‌ నుంచి కోలుకుంటున్నారు. దీంతో వివిధ కార్యక్రమాల్లో తమకు దగ్గరగా పాల్గొన్న వ్యక్తులు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్‌ లక్షణాలున్న ఉద్యోగులు, సిబ్బంది పరీక్షలు చేయించుకోగా.. దాదాపు పందిమందికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీలోని ఉద్యోగులు, సిబ్బంది భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు.


పాఠశాల విద్యార్థికి కరోనా

పుట్టపర్తి,  జనవరి 22: నగరపంచాయతీ పరిధిలోని ఎనుమలపల్లి ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థికి కరోనా సోకడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 12 మందికి జ్వరం రావడంతో వారికి  కరోనా పరీక్షలు నిర్వహించారు. జ్వరం, దగ్గు, జలుబు ఉ న్న విద్యార్థులను పాఠశాలకు పంపవద్దంటూ తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుడు మో హనబాబు తెలియజేశారు. ఆదివారం పాఠశాలలో శానిటేషన చేస్తున్నట్లు హెచఎం పేర్కొన్నారు.

Updated Date - 2022-01-23T06:20:17+05:30 IST