ఫ్లోరిడాలో విజృంభిస్తున్న మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో!

ABN , First Publish Date - 2020-08-27T05:29:45+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అమెరికాలో ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కాగా.. ఫ్లోరిడాలో గడిచిన 24 గంటల్లో 3,220 మంది కరోనా బారినపడ్డట్లు

ఫ్లోరిడాలో విజృంభిస్తున్న మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో!

ఫ్లోరిడా: కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అమెరికాలో ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కాగా.. ఫ్లోరిడాలో గడిచిన 24 గంటల్లో 3,220 మంది కరోనా బారినపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కాటుకు 153 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 6.08లక్షలు దాటిందని పేర్కొన్నారు. కొవిడ్-19 కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,733 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను తగ్గించినట్లు తెలుస్తోంది. గత నెలలో రోజుకు దాదాపు 50వేలకు పైగా పరీక్షలు చేయగా.. ఆగస్టులో సగటున రోజుకు 33వేల పరీక్షలు మాత్రమే చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 60లక్షలకు చేరువలో ఉంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు మహమ్మారి కారణంగా 1.82లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-08-27T05:29:45+05:30 IST