అమెరికాలో కరోనా విలయం.. 1.70లక్షలకు చేరువైన మరణాలు!

ABN , First Publish Date - 2020-08-14T02:30:21+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో దాదాపు 54వేల మంది కరోనా బారినప

అమెరికాలో కరోనా విలయం.. 1.70లక్షలకు చేరువైన మరణాలు!

వాషింగ్టన్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని  గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో దాదాపు 54వేల మంది కరోనా బారినపడ్డారు. సుమరు 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇపపటి వరకు అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 53.60లక్షలకు చేరింది. ఇందులో దాదాపు 28లక్షల మంది కరోనా నుంచి కోలుకుని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. కరోనా కాటుకు మరణించిన వారి సంఖ్య 1.70లక్షలకు చేరువైంది. అమెరికాలో ప్రస్తుతం 23లక్షలపైగా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇందులో సుమారు 17వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాలిఫోర్నియాలో 5.94లక్షల కేసులు నమోదవ్వగా.. ఫ్లోరిడాలో 5.50లక్షల మంది కరోనా బారినపడ్డారు. 


Updated Date - 2020-08-14T02:30:21+05:30 IST