దేశంలోని 650 జిల్లాల్లో 90 శాతం మేర‌కు త‌గ్గిన క‌రోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-21T17:33:17+05:30 IST

దేశంలో కరోనావైరస్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.

దేశంలోని 650 జిల్లాల్లో 90 శాతం మేర‌కు త‌గ్గిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ప్రతిరోజూ 50 వేలకు మంచిన క‌రోనా కేసులు మాత్ర‌మే న‌మోద‌వుతున్నాయి. దేశంలోని 650 జిల్లాల్లో 90 శాతం మేర‌కు కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. మీడియాకు అందిన‌ డేటా ప్రకారం జూన్ 12 -19 మధ్య, దేశంలోని 70 జిల్లాలలో మాత్రమే కరోనా కేసుల‌లో పెరుగుద‌ల క‌నిపించింది. అదే సమయంలో 27 జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 100 దాటింది. 18 జిల్లాల్లో ఈ సంఖ్య ఒక‌ట్ల స్థానంలోనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లో గత వారంలో కరోనా కేసులు పెరిగాయి. ఆ త‌రువాత కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌చ్చింది. యాక్టివ్ కేసుల‌ సంఖ్య 1.32 లక్షల నుంచి 15 వేల‌కు తగ్గింది. కేవ‌లం 20 రోజుల్లోనే కేసుల సంఖ్య త‌గ్గింది. అయితే ఇప్పుడు ప్రతిరోజూ మూడువేల క‌న్నా తక్కువ కేసులే న‌మోద‌వుతున్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకున్న‌వారిసంఖ్య పెరుగుతుండ‌గా, వ్యాధి బారిన ప‌డుతున్న‌వారి సంఖ్య అంత‌క‌న్నా త‌క్కువ‌గానే ఉంటోంది. 

Updated Date - 2021-06-21T17:33:17+05:30 IST