8 మందికి నెగెటివ్‌...

ABN , First Publish Date - 2020-04-03T11:28:28+05:30 IST

కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఎనిమిది మందికి ‘నెగెటివ్‌’ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రెండు రోజుల కిందట నమూనాలు సేకరిం

8 మందికి నెగెటివ్‌...

  • మరో 132 మంది ఫలితాలు రావలసి ఉందన్న అధికారులు
  • ఐసోలేషన్‌ వార్డుల్లో 173 మంది
  • క్వారంటైన్‌ సెంటర్స్‌లో 152 మంది

విశాఖపట్నం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఎనిమిది మందికి ‘నెగెటివ్‌’ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రెండు రోజుల కిందట నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించగా గురువారం ఉదయం ఫలితాలు వచ్చాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 333 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా, 190 మందికి నెగెటివ్‌ రాగా, 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఒకరు డిశ్చార్జ్‌ కాగా, మరో పది మంది ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 132కి సంబంధించిన రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. అదేవిధంగా నగరంలోని ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో 163 మంది, గీతం ఆసుపత్రిలో పది మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో 152 మంది వున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు అనుమానిత లక్షణాలతో చేరిన వారిలో 151 మందిని డిశ్చార్జి చేసినట్టు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2020-04-03T11:28:28+05:30 IST