49 దేశాల్లో 82వేల మందికి కొవిడ్-19

ABN , First Publish Date - 2020-02-28T12:57:06+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సంచలన వాస్తవాలను వెల్లడించింది....

49 దేశాల్లో 82వేల మందికి కొవిడ్-19

బీజింగ్ (చైనా) : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సంచలన వాస్తవాలను వెల్లడించింది. చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కొవిడ్ -19 ప్రపంచంలోని 49 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 49 దేశాల్లో 82వేల మందికి కొవిడ్ సోకిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. మొత్తం మీద కొవిడ్ మృతుల సంఖ్య 2800 మందికి చేరిందని డబ్ల్యూహెచ్‌ఓ వైద్యాధికారులు చెప్పారు. చైనా దేశంలోని హుబే సెంట్రల్ ప్రావిన్సులో 78,497 మందికి ఈ వైరస్ సోకగా, 2,744 మంది మరణించారు. ఇరాన్ దేశంలో 254 మందికి కొవిడ్ సోకగా, వారిలో 26 మంది మరణించారు. సౌత్ కొరియాలో 1766 మందికి కొవిడ్ పాజిటివ్ రాగా 13 మంది మృత్యువాత పడ్డారు. హాంకాంగ్ దేశంలో ఇద్దరు, ఇటలీలో 12 మంది, తైవాన్ లో ఒకరు, ప్రాన్స్ లో ఇద్దరు, ఫిలిప్పీన్స్ లో ఒకరు కొవిడ్ వల్ల మరణించారని  ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యాధికారులు ప్రకటించారు. జపాన్ దేశంలోని డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో 8 మంది ఈ వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. మకావ్, సింగపూర్, అమెరికా, కువైట్, థాయ్ లాండ్, బెహరైన్, ఆస్ట్రేలియా, మలేషియా, జర్మనీ, స్పెయిన్, వియత్నాం, యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, ఇరాక్, కెనడా, ఒమన్, ఇండియా, గ్రీస్, పాకిస్థాన్, ఫిన్ లాండ్, ఇజ్రాయిల్, స్విట్జర్లాండ్, లెబనాన్, ఆస్ట్రియా, స్వీడన్, ఈజిప్టు, అల్గేరియా, ఆఫ్ఘనిస్థాన్, నార్త్ మెసిడోనియా, జార్ఝియా, ఎస్టోనియా, బెల్జియం, రొమేనియా, నేపాల్, శ్రీలంక, కంబోడియా, నార్వే, డెన్మార్క్ దేశాల్లో కొవిడ్-19 ప్రబలిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో వివరించింది. 


Updated Date - 2020-02-28T12:57:06+05:30 IST