దేశంలో గ‌డ‌చిన 24 గంట‌ల్లో కొత్త‌గా 64,399 క‌రోనా కేసులు... పెరిగిన రిక‌వ‌రీ రేటు!

ABN , First Publish Date - 2020-08-09T17:38:42+05:30 IST

దేశంలో కరోనా రోగుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. గడ‌చిన‌ 24 గంటల్లో కొత్తగా 64,399 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా రోగుల సంఖ్య 21,53,011కు చేరుకుంది. మొత్తం మరణాల...

దేశంలో గ‌డ‌చిన 24 గంట‌ల్లో కొత్త‌గా 64,399 క‌రోనా కేసులు... పెరిగిన రిక‌వ‌రీ రేటు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోగుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. గడ‌చిన‌ 24 గంటల్లో కొత్తగా 64,399 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా రోగుల సంఖ్య 21,53,011కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 43,379కు చేరుకుంది. అయితే క‌రోనా బాధితుల్లో కోలుకుంటున్న‌వారి సంఖ్య పెరుగుతుండ‌టం ఉపశమనం కలిగించే విషయంగా మారింది. ఈరోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో 14,80,885 మంది బాధితులు కోలుకున్నారు. ఇది మొత్తం బాధితుల్లో 69 శాతంగా ఉంది. దేశంలో ప్ర‌స్తుతం 6,28,747 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది మొత్తం కేసుల‌లో 29 శాతంగా ఉంది. కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 1,45,889 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 17,902 మంది మరణించారు. తమిళనాడులో 52,759, ఆంధ్రప్రదేశ్‌లో 84,654, ఢిల్లీలో 10,409 కేసులు ఉన్నాయి. ఇదిలావుండ‌గా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరిల‌కు కరోనా సోకినట్లు గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం శుక్రవారం వరకు దేశంలో మొత్తం 2,33,87,171 క‌రోనా టెస్టుల చేశారు.

Updated Date - 2020-08-09T17:38:42+05:30 IST