వైరస్‌లకు విరుగుడు నానో శానిటైజర్లు

ABN , First Publish Date - 2020-04-05T05:50:13+05:30 IST

మన చుట్టూ అన్ని వైపులా ఎవరికీ కనిపించని బ్యాక్టీరియా, వైర్‌సలు ఉంటాయి. మనకు వచ్చే వ్యాధులన్నీ వీటి వల్లే వస్తూ ఉంటాయి. కరోనా దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. మన శరీరానికి, చుట్టు పక్కల ఉండే వస్తువులపై ఉన్న బ్యాక్టీరి...

వైరస్‌లకు విరుగుడు నానో శానిటైజర్లు

జేఎన్‌టీయూ సహకారంతో తయారీ


మన చుట్టూ అన్ని వైపులా ఎవరికీ కనిపించని బ్యాక్టీరియా, వైర్‌సలు ఉంటాయి. మనకు వచ్చే వ్యాధులన్నీ వీటి వల్లే వస్తూ ఉంటాయి. కరోనా దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. మన శరీరానికి, చుట్టు పక్కల ఉండే వస్తువులపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌ల నిర్మూలనకు నానో టెక్నాలజీ ద్వారా పరిష్కార మార్గాలు కనుగొనటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌ జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం, డీ నానో టెక్నాలజీస్‌ కలిపి నానో శానిటైజర్లను రూపొందించాయి. 


‘‘ఒక సారి శానిటైజర్‌ వాడితే దాని ప్రభావం 30 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దాని ప్రభావం పోతుంది. కానీ డాక్టర్‌ నానో శానిటైజర్లను వాడితే ఆ ప్రభావం 30 నిమిషాల వరకూ ఉంటుంది. వీటిలో ఉండే వెండి నానో కణాలే దీనికి కారణం..’’ అంటారు డాక్టర్‌ నానో ఎండీ సుస్మిత. వైర్‌సలను నిర్మూలించే శక్తి వెండికి ఎక్కువగా ఉంటుంది. అందువల్లే మన పూర్వీకులు చాలా మంది వెండి కంచాల్లో తినేవారు. వెండిలో ఉండే ఆ శక్తిని సమర్థంగా ఉపయోగించుకోవటానికి రకరకాల ప్రయోగాలు జరిగాయి. వీటిలో నానో వెండి తయారీ కూడా ఒకటి. వెండిని ప్రత్యేకమైన రసాయన ప్రక్రియ ద్వారా అణు స్థాయిలో విడగొట్టినప్పుడు అది నానో మెటీరియల్‌గా మారుతుంది. మన కంటికి కనిపించని అత్యంత సూక్ష్మమైన కణాలు నేరుగా వైర్‌సకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ‘‘మా శానిటైజర్లలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, నానో వెండిని కలిపి వాడతాం. దీని వల్ల మామూలు శానిటైజర్ల కన్నా 20 రెట్లు ఎక్కువ శక్తిమంతమైన ద్రావకం తయారవుతుంది. దీనికి బ్యాక్టీరియాను, ఇతర రకాల వైర్‌సలను చంపే శక్తి ఉంటుంది. అంతే కాకుండా దీని వల్ల పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు.’’ అని సుస్మిత ఈ శానిటైజర్‌ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని వెల్లడించారు. శానిటైజర్లలో అవసరమైన నానో మెటిరియల్‌ తయారీకి జేఎన్‌టీయూలో ఉన్న ప్రత్యేక ల్యాబ్‌ను ఉపయోగిస్తున్నామని డాక్టర్‌ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ‘‘ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నానో మెటీరియల్స్‌తో చేసిన శానిటైజర్ల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం ఇవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి’’ అని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2020-04-05T05:50:13+05:30 IST