తస్మాత్‌ జాగ్రత్త..!

ABN , First Publish Date - 2020-04-02T10:31:33+05:30 IST

జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది. మక్కా, ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి భయం జిల్లాలో ఎలాగూ ఉంది.

తస్మాత్‌ జాగ్రత్త..!

భౌతిక దూరం పాటిస్తేనే సురక్షితం

వచ్చే రెండు వారాలూ కీలకం

పింఛన్‌ల పంపిణీకే వలంటీర్లు పరిమితం

ఇంటింటి సర్వే ఉత్తిదే

రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న జనం

మిన్నకుండిపోతున్న పోలీసు యంత్రాంగం 


అనంతపురం,ఏప్రిల్‌1(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో  ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది. మక్కా, ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి భయం జిల్లాలో ఎలాగూ ఉంది. ఈ నేప థ్యంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి.  అత్యవస రమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదు. వచ్చినా భౌతిక దూరాన్ని పాటించాలి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెంద కుండా నిరోధించాలంటే ఈ రెండు సూత్రాలను ప్రధానం గా అనుసరించాల్సి ఉంది. జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గానే లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఆ మేరకు కనిపించడం లేదు.


ఉదయం 6 గంటల నుంచి 11 గం టల వరకూ ఆంక్షల సడలింపు ఉంది. అయితే మిట్ట మధ్యాహ్నం కూడా జనం రోడ్లపై తిరగడం ఎంత ప్రమాద కరమో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసుశాఖ గుర్తించాల్సి ఉంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ, పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రాబోయే రెండు వారాల్లో ప్రజలు ఎంత స్వీయ నియంత్రణ పాటిస్తే.... కరోనా వైరస్‌ వ్యాప్తిని అంతగా నిరోధించవచ్చని వైద్యవ ర్గాలు పేర్కొంటున్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.... ఇప్పటి వరకూ అమలైన లాక్‌డౌన్‌ లక్ష్యం నీరుగారిపో తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యం త్రాంగం, పోలీసుశాఖ స్వీయ కట్టడిలో భాగంగా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. 


పాజిటివ్‌ కేసులు నమోదైనా..

జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదైనా ప్రజల్లో ఏమా త్రం భయం కలగడం లేదు. ఎప్పుడంటే అప్పుడు  రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. వారిని నియంత్రించాల్సిన పోలీసులు మిన్నకుండిపోతున్నారు. పగలైనా, రాత్రయినా దర్జాగా పోలీసుల ముందు నుంచే అందులోనూ ప్రధాన కూడళ్ల మీదుగానే పనీపాట లేని కొందరు బైకుల్లో వెళ్తు న్నా ఏ ఒక్క పోలీసూ వారిని అడ్డగించడం లేదన్న విమ ర్శలు వినిపిస్తున్నాయి. ఇక అర్ధరాత్రి వేళల్లో దర్జాగా మో టరు బైకుల్లో తిరుగుతున్నా ఎక్కడి నుంచి వస్తున్నావని అడిగే నాథుడే కరువయ్యారు. ఓ వైపు పాజిటివ్‌ కేసులు, మరోవైపు ఢిల్లీ దడ, మక్కా గుబులు ప్రజలను బెంబేలె త్తిస్తున్న తరుణంలో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.  


శాంపిల్స్‌ సేకరణలోనే జాప్యం

కరోనా వైరస్‌ అనుమానిత కేసులు రోజురోజుకు అధిక మవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 118 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో మక్కా యాత్రికులు, ఢిల్లీ జమాతేకు వెళ్లొచ్చిన వారున్నా రు. అయితే అధికారులు శాంపిల్స్‌ సేకరణలోనే తరిస్తు న్నారు. ఇక పరీక్షలు ఎప్పుడు చేస్తారన్నది అంతుపట్టడం లేదు. జిల్లా కలెక్టర్‌ సైతం శాంపిల్స్‌ సేకరణ విషయంలో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారంటే జిల్లాలో పరిస్థితి ఇందుకు అద్ధం పడుతోంది. ఇక రిపోర్టులు ఎప్పుడొస్తాయన్నది ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.  


వలంటీర్లతో ఇంటింటా సర్వే ఉత్తిదే...

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా వలంటీర్లతో ఇంటిం టా సర్వే నిర్వహిస్తున్నామన్నది ఉత్తిదేనని తేలిపోయింది. వలంటీర్లు పింఛన్‌ల పంపిణీకే పరిమితమయ్యారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఏ వలంటీర్‌ కూడా కరోనా వైరస్‌కు సంబంధించి ఏ ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన దాఖలాలు   లేవనే చెప్పాలి. జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. వీరంతా ఇప్పటి వరకూ అటు పల్లెల్లోగానీ.... ఇటు పట్టణాల్లోగానీ ఇంటింటా సర్వేకు రాలేదని ప్రజలే చెబుతున్నారు. పింఛన్‌ల పంపిణీకి మాత్రం వస్తున్నారని నిజాన్ని వెల్లడిస్తున్నారు. ఆశా వర్కర్‌లు, ఏఎన్‌ఎంలు మాత్రమే ఇంటింటా సర్వేకు వస్తున్నారని ప్రజలు చెబు తున్నారు. 


అనంత పాతూరు మార్కెట్‌తో పొంచి ఉన్న ముప్పు

జిల్లా కేంద్రంలోని పాతూరు కూరగాయల మార్కెట్‌కు తండోపతండాలుగా వచ్చే వారితో ప్రమాదం పొంచి ఉన్నట్టు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో భౌతికదూరం పాటిం చే విధంగా మరో ఆరు కూరగాయలు, పండ్లు మార్కెట్‌ లను నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ప్రజలు అక్కడికి వెళ్లడం లేదు. పాతూరు మా ర్కెట్‌కే గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. భౌతికదూరం పాటించేందుకు అక్కడ అవసరమైన స్థలం లేదు. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు బలంగా ఉన్నా  యి.


ఈ విషయాన్ని పదే పదే అధికారుల దృష్టికి తీసు  కెళ్లినప్పటికీ పాతూరు మార్కెట్‌ను తరలించ డంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు. దీనికి తోడు అధికార పార్టీ నాయకులు అక్కడి నుంచి మార్కెట్‌ను తరలించకుండా అడ్డుపడుతున్నారన్న విమర్శలు ఉన్నా యి. బుధవారం మార్కెట్‌లో సాధారణ రోజుల్లో మాదిరిగానే ప్రజలు గుంపులు గా చేరారు. జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి లాక్‌డౌన్‌ కొనసాగినంత వరకైనా వేరే ప్రాంతానికి పాతూరి మార్కెట్‌ను తరలిస్తే పరిస్థితులు అదుపులోకి వస్తాయ న్న అభిప్రా యం సర్వత్రా వ్యక్తమవుతోంది. 


హిందూపురం, లేపాక్షిలో హై అలర్ట్‌ ప్రకటనకే పరిమితం

కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు హిందూపురం, లేపాక్షి లో నమోదైన నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల్లో హై అల ర్ట్‌ ప్రకటించారు. పాజిటివ్‌ కేసులు నమోదైన వారి ఇళ్లకు కి.మీ పొడవునా ఆ పరిసర ప్రాంతాలన్నీ నిషిద్ధ ప్రదేశం గా ప్రకటించారు. అవి ప్రకటనలకే పరిమిత మయ్యాయి. హిందూపురం పట్టణంలో విచ్చలవి డిగా స్థానికులు రోడ్లపై తిరుగుతున్నా నియంత్రించే నాథుడు కరువ య్యారు. 

Updated Date - 2020-04-02T10:31:33+05:30 IST