Abn logo
Oct 1 2020 @ 09:38AM

లాక్‌డౌన్ తర్వాత తొలి సినిమా ఇదే: వర్మ

Kaakateeya

లాక్‌డౌన్ సమయంలో ఏటీటీల ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం `కరోనా వైరస్` పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. 


అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో `కరోనా వైరస్`ను వర్మ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. `మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంద`ని వర్మ ట్వీట్ చేశాడు. 



Advertisement
Advertisement
Advertisement