Advertisement
Advertisement
Abn logo
Advertisement

అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయండి

అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయండి

నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌

వన్‌టౌన్‌, డిసెంబరు 3: వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. సింగ్‌నగర్‌ పరిధిలోని 58వ డివిజన్‌లో జరుగుతున్న పనులను శుక్రవారం పరిశీలించారు. డిప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైల జారెడ్డి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కమిషనర్‌ను కోరారు. ఆ మేరకు కమిషనర్‌ అధికారులకు సూచనలు చేశారు. శివారు ప్రాంతాల్లో రోడ్ల పనులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఇందిరానాయక్‌ నగర్‌లో వైఎస్‌ఆర్‌ హెల్త్‌ సెంటర్‌ పనులను పరిశీలించారు. పార్కు ఏర్పాటుకు తగిన స్థలాన్ని ఎంపిక చేయాలన్నారు.  వన్‌టౌన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద షాదీఖానా నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్ట్సు ఎస్‌ఈ పి వికే భాస్కరరావు , ఈఈలు వి. శ్రీనివాస్‌, ఎఎన్‌ఎన్‌ ప్రసాద్‌, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రామకోటేశ్వరరావు, డీఈలు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement