నేడు కార్పొరేషన్‌లో ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2020-12-04T05:06:40+05:30 IST

నాలుగు చక్రాల మినీట్రక్కు వాహనం పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషనరు లవన్న ప్రకటనలో తెలిపారు.

నేడు కార్పొరేషన్‌లో ఇంటర్వ్యూలు

కడప(ఎర్రముక్కపల్లె), డిసెంబరు 3: నాలుగు చక్రాల మినీట్రక్కు వాహనం పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషనరు లవన్న ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీ, క్రిష్టియన్‌ మైనార్టీ అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని, దరఖాస్తుదారులు తప్పక హాజరు కావాలని కోరారు.

Updated Date - 2020-12-04T05:06:40+05:30 IST