కార్పొరేషన్‌ పదవుల సందడి.. గుంటూరు జిల్లా వాసులకు నాలుగు పదవులు?

ABN , First Publish Date - 2020-10-01T14:08:12+05:30 IST

వివిధ కులాల కార్పొరేషన్లకు ఒకేసారి చైర్మన్లను నియమించేందుకు..

కార్పొరేషన్‌ పదవుల సందడి.. గుంటూరు జిల్లా వాసులకు నాలుగు పదవులు?

గుంటూరు(ఆంధ్రజ్యోతి): వివిధ కులాల కార్పొరేషన్లకు ఒకేసారి చైర్మన్లను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోండటంతో వైసీపీ లో సందడి నెలకొన్నది. దాదాపుగా నాలుగు కార్పొరేషన్లకు జిల్లా నుంచి చైర్మన్లను నియమించేందుకు వైసీపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. షేక్‌, కుమ్మరి శాలివాహన, కృష్ణబలిజ, వడ్డెర కార్పొరేషన్లకు జిల్లాకు చెం దిన ఆ పార్టీ నాయకుల నియామకం దాదాపుగా ఖరారైందని సమాచారం. ఇందుకు సంబంధించి అధికారికంగా నేడో, రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నది. పొన్నూరు నియోజక వర్గంలో కీలకంగా వ్యవహరించిన షేక్‌ యాసిన్‌ను షేక్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారని సమాచారం.


ఆయన 2014లోనే పొన్నూరు టిక్కెట్‌ను ఆశిం చారు. సామాజిక సమీకరణల్లో భాగంగా ఆయనకు టిక్కెట్‌ దక్కకపో యినప్పటికీ పార్టీకి విధేయుడుగా పనిచేశారు. బెల్లంకొండ మాజీ జడ్పీటీసీ దేవళ్ళ రేవతిని వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నియమించారని తెలిసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో జడ్పీ ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించారు. గుంటూరు అమరావతి రోడ్డులోని గోరంట్లకు చెందిన మండెపూడి పురుషోత్తం కుమ్మర శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యార ని వైసీపీ వర్గాల సమాచారం. ఆయన తొలి నుంచి వైఎస్‌ కుటుంబానికి వీరాభిమాని. కృష్ణ బలిజ, పూసల సామాజిక వర్గ కార్పొరేషన్‌కు గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన కోలా మణికంఠ సతీమణి భవానీని నియమిం చినట్లు వైసీపీ నాయకుల్లో చర్చ జరుగుతోన్నది.  


ఎన్నికల హామీ మేరకు..

గతంలో వివిధ సామాజికవర్గాలకు ఫెడరేషన్లు ఉండేవి. అయితే ఎన్ని కలకు ముందు సీఎం జగన్‌ తాను అధికారంలోకి వస్తే అన్ని ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్‌ చేసి బడ్జెట్‌ పెంచుతానని హామీ ఇచ్చారు. ఆ మేరకు బీసీ డిక్లరేషన్‌ని కూడా ప్రకటించారు. ప్రభుత్వం ఇటీవలే వివిధ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా షేక్‌ యాసిన్‌, దేవళ్ల రేవతి, మండేపూడి పురుషోత్తం, కోలా భవానిలు పార్టీ కోసం కష్టపడ్డారు. దీంతో వారి సేవలకు గుర్తింపుగా ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించేందుకు జిల్లా నాయకత్వం సిఫార్సు చేయడంతో అధిష్ఠానం అంగీకరించింది.  

Updated Date - 2020-10-01T14:08:12+05:30 IST