కొండంత అవినీతి

ABN , First Publish Date - 2020-11-30T06:37:30+05:30 IST

అనకాపల్లి మండలంలోని పలు రాయి, గ్రావెల్‌ క్వారీల్లో మైనింగ్‌ నిబంధలను పాతర వేస్తున్నారు. ఏళ్లతరబడి గనుల శాఖ అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడం ఆయా యజమానులు ఇష్టానుసారంగా తవ్వేశారు.

కొండంత అవినీతి
మార్టూరులో అంజనీ స్టోన్‌ క్రషర్స్‌కు చెందిన క్వారీలో తనిఖీ చేస్తున్న గనుల శాఖ విజిలెన్స్‌ అధికారి.

అనకాపల్లి రాయి క్వారీల్లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

పర్మిట్లకు మించి తవ్వకాలు, రాయి తరలింపు

గనుల శాఖ అధికారులు, సిబ్బంది అండదండలు

స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం

ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌

విచారించేకొద్దీ వెలుగులోకి వస్తున్న అక్రమాలు

ఇప్పటికే పది క్వారీల్లో తనిఖీలు

మరో 13 క్వారీల్లో తనిఖీలకు సన్నద్ధం


విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): 

అనకాపల్లి మండలంలోని పలు రాయి, గ్రావెల్‌ క్వారీల్లో మైనింగ్‌ నిబంధలను పాతర వేస్తున్నారు. ఏళ్లతరబడి గనుల శాఖ అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడం  ఆయా యజమానులు ఇష్టానుసారంగా తవ్వేశారు. కార్యాలయంలో కొందరు అధికారులు, సిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీసుల సహకారంతో అడ్డగోలుగా కొండల్ని కొట్టేశారు. పర్మిట్లకు మిం చి పెద్ద ఎత్తున రాయి, గ్రావెల్‌ అమ్ముకుని సొమ్ము చేసు కు న్నారు. గనుల శాఖ నుంచి తీసుకున్న పర్మిట్లును మరొ కరికి అమ్మేయడం, ఒకచోట పర్మిట్‌ తీసుకుని మరోచోట తవ్వకాలు చేపట్టడం వంటి అక్రమాలు ఎన్నో జరిగాయి. వీటిపై మారూ ్టరు, పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో 250 నుంచి 300 వరకు రాయి, గ్రావెల్‌ క్వారీలు ఉన్నాయి. వీటిల్లో 23 క్వారీల్లో అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో గనుల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదులు వెళ్లడంతో గనుల శాఖ విజిలెన్స్‌ అధికారులు రెండు నెలల నుంచి తనిఖీలు చేస్తు న్నారు. ఇప్పటివరకు పది క్వారీల్లో అక్రమాలు గుర్తిం చి భారీగా జరిమా నాలు విధించారు. తాజాగా హైద రాబాద్‌కు చెందిన అపర్ణ స్టోన్‌ క్రషర్స్‌, ఒంగో లుకు చెందిన ఎంఎస్‌ రెడ్డిఅనే వ్యాపారికి చెందిన అంజనీ స్టోన్‌ క్రషర్స్‌పై దాడులు నిర్వ హించారు. మార్టూరు గ్రామం లో సర్వే నంబరు- 1లో 6.4 హెక్టార్లలో రోడ్‌ మెటల్‌, గ్రావెల్‌ తవ్వకాలకు అపర్ణస్టోన్‌ క్రషర్స్‌ లైసెన్స్‌ తీసుకున్నది. ఈ క్వారీలో 3,23,031 క్యూబిక్‌ మీటర్ల రోడ్‌ మెటల్‌ తవ్వకాలకు తాత్కాలిక పర్మిట్లు తీసుకున్న కంపెనీ.... కేవలం 34,114 క్యూబిక్‌ మీటర్ల రాయిని మాత్రమే తవ్వింది. మిగిలిన 2,88,917 క్యూబిక్‌ మీటర్ల రాయికి సంబంధించి పర్మిట్లను ఇతర కంపెనీలకు అమ్ము కుంది. తనిఖీల్లో దీనిని గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు సదరు కంపెనీకి రూ.16,43,35,990 జరిమానా విధించారు. కాగా ఒంగోలుకు చెందిన ఎంఎస్‌ రెడ్డి అనేవ్యక్తి మార్టూరులో సర్వే నంబరు-1లో అంజనీ స్టోన్‌ క్రషర్స్‌ పేరిట 6.784 హెక్టార్లను లీజుకు తీసుకున్నారు. ఇక్కడ 3,00,208 క్యూబిక్‌ మీటర్ల రోడ్‌ మెటల్‌ తవ్వడానికి తాత్కాలిక పర్మిట్లు తీసుకున్నారు. కానీ 1,32,285 క్యూబిక్‌ మీటర్ల రోడ్‌మెటల్‌ తవ్వి మిగిలిన 1,67,923 క్యూబిక్‌ మీటర్లకు సంబంధించిన పర్మిట్లను ఇతర క్వారీలకు విక్రయిం చారని నిర్ధారించారు. సాధారణ సీనరేజ్‌, దానిపై ఐదురెట్లు జరిమానా, మెరిట్‌ టాక్స్‌, ఇతర పన్నుల కలిపి రూ.9,55, 14,602 జరిమానా విధించారు. ఇంకా గ్రావెల్‌ తవ్వకాల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడైంది. 2,996 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తవ్వకాలకు పర్మిట్లు తీసుకుని 17,698 క్యూబిక్‌ మీటర్లు తవ్వారు. ఇచ్చిన పర్మిట్లు కంటే 14,702 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ ఎక్కువ తవ్వినట్టు గుర్తిం చారు. సాధారణ సీన రేజ్‌తో పాటు, అపరాధ రుసుం, ఇతర పన్నులు కలిపి రూ.41,81,249 జరిమానా విధిం చారు. ఈ రెండు క్వారీ ల్లో మెటల్‌, ఒకచోట గ్రావెల్‌ తవ్వ కాలకు సంబం ధించి మొ త్తం రూ.26,40, 31,841 చెల్లించాలని అపర్ణ స్టోన్‌ క్రషర్స్‌ యజమాని, అంజనీ స్టోన్‌ క్రషర్స్‌ యజమాని ఎంఎస్‌. రెడ్డికి నోటీస్‌లు జారీ చేస్తా మని గనుల శాఖ విజి లెన్స్‌ ఏడీ ప్రతారెడ్డి తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదులతో ఇప్పటి వరకు 10 క్వారీలను తనిఖీ చేసిన అధి కారులు మిగిలిన 13 క్వారీలను త్వరలో తనిఖీ చేయనున్నారు. 


తాజాగా మరో 10 క్వారీలపై ఫిర్యాదులు

అనకాపల్లి మండలంలో నల్లరాయి, గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్న మరో 10 క్వారీలపై ప్రభుత్వానికి స్థానికులు ఫిర్యాదు చేశారు. క్వారీల నిర్వాహకుల అక్రమాలపై గనుల శాఖ అధికారులకు అనేకపర్యాయాలు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి గనుల శాఖ కార్యాలయంలో కొందరు అధికారులు, సిబ్బంది ప్రమేయంతోనే క్వారీ యజమానులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని తాజాగా పంపిన ఫిర్యాదులో పేర్కొనట్టు తెలిసింది. వీటికి సంబంధించి తనిఖీ చేపట్టాలని త్వరలో విజిలెన్స్‌కు ఆదేశాలు జారీ కావచ్చని తెలిసింది. 


రంగంలోకి వైసీపీ నేతలు

అనకాపల్లి మండలంలోని క్వారీలపై గనుల శాఖ విజిలెన్స్‌ దాడుల నేపథ్యంలో స్థానికంగా ఉండే అధికార పార్టీ నేతలు కొందరు రంగంలోకి దిగారు. అనకాపల్లి పరిసరాల్లో ఎన్ని క్వారీలు ఉన్నాయి? ఎప్పటి వరకు అను మతులు ఉన్నాయి? యజమానులు ఎవరు? అన్న వాటిపై ఆరా తీస్తున్నారు. విజి లెన్స్‌ అధికారుల నుంచి జరిమానా నోటీసులు అందుకున్న కంపెనీ ప్రతినిధులతో వీరు మాట్లాడుతున్నట్టు అనకాపల్లిలో ప్రచారం జరుగుతున్నది. గనుల శాఖ మంత్రితో మాట్లాడి జరిమానాలను రద్దు చేయించడం లేదా తగ్గించడం చేయి స్తామని హామీ ఇస్తున్నారు. 

Updated Date - 2020-11-30T06:37:30+05:30 IST