మున్సిపల్‌ చెత్త ట్రాలీల కొనుగోలులో అవినీతి

ABN , First Publish Date - 2020-10-29T07:00:47+05:30 IST

మున్సిపాలిటీ పరిధిలో చెత్త తరలించేందుకు ట్రాలీల కొనుగోలులో పాలకవర్గ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రావుల ఉప్పలయ్య అన్నారు.

మున్సిపల్‌ చెత్త ట్రాలీల కొనుగోలులో అవినీతి

కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రావుల ఉప్పలయ్య 


ఏసీసీ, అక్టోబరు 28: మున్సిపాలిటీ పరిధిలో చెత్త తరలించేందుకు ట్రాలీల కొనుగోలులో పాలకవర్గ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రావుల ఉప్పలయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పాలకవర్గం చేస్తున్న అవినీతిపై ప్రశ్నించి నిజాలను ప్రజల ముందుకు తాము తీసుకెళ్తున్నామని చెప్పారు. దీన్ని సహించలేని టీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా మున్సి పల్‌ నిధులతో చేసే కొనుగోళ్లలో కమీషన్లకు కక్కుర్తి పడ్డారని చెప్పారు. వచ్చిన ముడుపుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లకు కూడా లంచం ఇవ్వజూపారని ఆయన తెలిపారు. ప్రేమ్‌సాగర్‌రావుపై చేస్తున్న ఆరోప ణలు పూర్తి నిరాధారమని వివరించారు. గతంలోనే దీనిపై చాలాసార్లు వివరణ ఇచ్చామని చెప్పారు. పాలకవర్గం చేస్తున్న అవినీతిని నిలదీస్తూ తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని అన్నారు.


దీన్ని జీర్ణించుకోలేని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో తమ నాయకునిపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటు న్నారని ఆయన ఎద్దేవా చేశారు.  సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లు వేములపల్లి సంజీవ్‌, షేక్‌ మాజీద్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రామగిరి భానేష్‌, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ సత్తార్‌, డీసీసీ సెక్రెటరీ నల్ల రవి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సల్ల మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T07:00:47+05:30 IST