Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిప్పుకు అవినీతి చెదలు

ఫైర్‌ సిబ్బంది అసఖ్యతతో వెలుగులోకి అక్రమాలు

వసూళ్లకు పాల్పడుతున్న లీడింగ్‌ఫైర్‌మన్‌

నకిలీ ఫరం పేరుతో రీఫిల్లింగ్‌8 విధులను పట్టించుకోని డ్రైవర్‌

అగ్ని ప్రమాదాలను నివారించే మిర్యాలగూడ ఫైర్‌స్టేషన్‌లో సిబ్బంది వ్యవహారం శాఖ పరువు మంటగలుపుతోంది. నిప్పును అర్పే సిబ్బందే అవినీతి, అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాల   మంట రాజేస్తున్నారు. ఒకరు పోలీస్‌ గుర్తింపుకార్డు సృష్టించారని, మరొక రు స్టేషన్‌ను అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. శాఖ పరువును బజారును పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

-మిర్యాలగూడ    / మిర్యాలగూడ అర్బన్‌ 

పారిశ్రామికవాడగా పేరొందిన మిర్యాలగూడ పరిసరాల్లో రైస్‌మిల్లులతోపాటు పెట్రోల్‌బంక్‌లు, ప్రైవేట్‌ ఆస్పత్రులు విస్తరించాయి. వీటన్నింటిలో ఫైర్‌సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉంది. దీనిని మిర్యాలగూడ ఫైర్‌స్టేషన్‌ లీడింగ్‌ ఫైర్‌మెన్‌ అవకాశంగా మార్చుకున్నాడు. రెండేళ్ల కిందట బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన అక్రమ దందాలకు బీజం వేశాడు. ప్రతి ఏటా వాణిజ్యసంస్థలతో పాటు ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఫైర్‌సేఫ్టీ పరికరాలను శుద్ధి చేయించాల్సి ఉంటుంది. ఫైర్‌స్టేషన్‌ నుంచి అనుమతి పొందిన సంస్థ నుంచి పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ తతంగమంతా గొలుసుకట్టు పద్ధతిలో ఏడాది పొడవునా కొనసాగుతుంది. ఈ బాధ్యతను ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో యూనిక్‌ ఫైర్‌సేఫ్టీ సొల్యూషన్‌ అధికారికంగా తీసుకుంది. ఈ సంస్థ నుంచి ఫైర్‌సేఫ్టీ పరికరాల సరఫరా, రెన్యూవల్‌ జరగకుండా లీడింగ్‌ ఫైర్‌మన్‌ సత్యనారాయణరెడ్డి రెండేళ్లుగా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

నకిలీ సంస్థ ఏర్పాటు చేసి..

సర్టిఫైడ్‌ సంస్థకు రెన్యువల్‌ కాకుండా అడ్డుకుంటున్న సత్యనారాయణరెడ్డి ‘శివం ఫైర్‌ సర్వీస్‌’ నకిలీ ఫరంను సృష్టించారన్న ఆరోపణన్నాయి. ఆ సంస్థ పేరుతో ఆయా సంస్థలకు పరికరాల్లో మందును రీఫిల్‌ చేసినట్లుగా పత్రాలు జారీ చేస్తున్నట్లు చెబుతున్నారు. అగ్నిమాపకశాఖ అనుమతి పొందిన సంస్థలు మాత్రమే ఫైర్‌సేఫ్టీ పరికరాలను సరఫరాచేయ డం, గడువు ముగిసిన వాటికి మరమ్మతులు జరిపి, రీఫిల్‌ చేసి ఫరం అడ్ర్‌సతో ముద్రించిన పత్రాలతో పాటు స్టిక్కర్లను అంటిస్తారు. అయితే ఉద్యోగి సృష్టించిన ఫరం నుంచి అందజేస్తున్న పత్రాల్లో ఎక్కడా కూడా సంస్థకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ నెంబరు లేకపోవడం గమనార్హం. 

నకిలీ పోలీస్‌ గుర్తింపుకార్డుతో..

అక్రమాలకు పాల్పడుతున్న సత్యనారాయణరెడ్డి ఏకంగా పోలీ్‌సకానిస్టేబుల్‌ ఐడీ కార్డును సృష్టించి మామూళ్లు దండుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్డును ఉపయోగించి ప్రత్యేకంగా కలిసేందుకు వచ్చినట్లుగా పరిచయం చేసుకుని మాముళ్లు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. పోలీ్‌సశాఖ పేరుతో తయారు చేసిన నకిలీ ఐడెంటిటీకార్డుతో స్పెషల్‌ పార్టీ పోలీ్‌సగా చెలామణి అవుతూ పెద్దమొత్తంలోనే మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

మిర్యాలగూడ అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌ సత్యనారాయణరెడ్డి అక్రమ దందాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో స్పందించిన అధికారులు సమగ్రవిచారణకు ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యూనిక్‌ ఫైర్‌సేఫ్టీ సొ ల్యూషన్‌ నిర్వాహకుడు షేక్‌ నజీర్‌ లీడింగ్‌ ఫైర్‌మెన్‌ నిర్వహిస్తున్న శివం ఫైర్‌సర్వీ్‌ససెంటర్‌పై స్థానిక ఎస్‌ఎ్‌ఫవోకు ఫిర్యాదు చేశాడు. 

మరో ఉద్యోగి వ్యవహారశైలిపై..

ఫైర్‌స్టేషన్‌లో ప్రతిక్షణం అందుబాటులో ఉండాల్సిన డ్రైవర్‌ స్టేషన్‌ ఇన్‌చార్జికి సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి బయటకు వెళ్తాడనే అభియోగాలున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిసెంబరు 8న నిర్వహించాల్సిన డ్రిల్‌పై దృష్టి సారించాలని చెప్పినందునే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లీడింగ్‌ ఫైర్‌మన్‌ సత్యనారాయణరెడ్డి అన్నారు. ఐడీ కార్డుల మార్ఫింగ్‌కు పాల్పడి, మిల్లర్ల వద్ద వసూళ్లకు పాల్పడినట్లు పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు. 

బెదిరిస్తూ.. అధిక ధరలు వసూలు చేస్తూ...

సాధారణంగా రూ.1200లకు ఫైర్‌సేఫ్టీ సిలిండర్‌లో తొమ్మిది కిలోల డ్రై కెమికల్‌ పౌడర్‌ను రీఫిల్‌ చేస్తారు. కానీ, సత్యనారాయణరెడ్డి తన అధికార దర్పం ప్రదర్శించి ఒక్కో పరికరం రీఫిల్లింగ్‌ కోసం రూ.2వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కార్బన్‌ డై ఆక్సైడ్‌ సిలిండర్‌ రీఫిలింగ్‌ ఖర్చు రూ.1300 ఉంటే రూ.1800 వరకు ముక్కుపిండి వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ప్రమాదం జరిగినప్పుడు మేమెచ్చి మంటలు ఆర్పుతామా..? ఏజెన్సీ వాళ్లు వస్తారా? అంటూ ఎదురు ప్రశ్నించి తనపని కానిచ్చిస్తున్నాడు. ఇలా మిర్యాలగూడ ఫైర్‌స్టేషన్‌ పరిఽధిలోనే ప్రతి ఏడాది పొడవునా సుమారు ఐదు వేలకు పైగా ఫైర్‌సేఫ్టీ సిలిండర్లు, మరో మూడు వేల వరకు కార్బన్‌ డై ఆక్సైడ్‌ సిలిండర్ల రీఫిల్లింగ్‌ జరుగుతుండడంతో చేయాల్సి ఉంది. ఇందుకోసమే సత్యనారాయణరెడ్డి సొంత సంస్థను నెలకొల్పినట్లు ప్రచారం సాగుతోంది. 

అవినీతి అక్రమాలు లేవు

ఫైర్‌స్టేషన్‌లో అవినీతి, అక్రమాలు జరగలేదు. సిబ్బంది వ్యక్తిగత తగాదాల వల్ల శాఖ ప్రతిష్ఠ దిగజారుతోంది. ఆరోపణలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం.

- కె.రాజు, ఫైర్‌స్టేషన్‌ అధికారి

Advertisement
Advertisement