రూ.లక్షల ఖర్చు... లక్ష్యం దూరం

ABN , First Publish Date - 2021-08-01T05:56:56+05:30 IST

ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నా లక్ష్యం చేరని దుస్థితి నెలకొంది. ఏటా వర్షాకాలంలో ఏజెన్సీలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, చికున్‌గున్యా వంటి వ్యాధులు వణికిస్తు న్నాయి.

రూ.లక్షల ఖర్చు... లక్ష్యం దూరం
మలేరియా కార్యాలయంలో వృథాగా ఫాగింగ్‌ యంత్రాలు:

 ఫాగింగ్‌ యంత్రాలు నిరుపయోగం ఫ చోద్యంచూస్తున్న మలేరియా విభాగ అధికారులు


సీతంపేట: ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నా లక్ష్యం చేరని దుస్థితి నెలకొంది. ఏటా వర్షాకాలంలో ఏజెన్సీలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, చికున్‌గున్యా వంటి వ్యాధులు వణికిస్తు న్నాయి. దీంతో ప్రజారోగ్యంకోసం బడ్జెట్‌లో కోట్లాది రూపాయలు వెచ్చిస్తు న్నారు. ఏజెన్సీలో డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్‌ నిర్మూలించేందుకు వీలు గా మలేరియా విభాగం  పకడ్బందీ చర్యలు తీసుకోవల్సి ఉంది. ఏటా గిరిజ న ప్రాంతాల్లో దోమల నివారణకు తెరల పంపిణీ, మలాథియన్‌స్పే చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ, ఐటీడీఏలు వర్షాకాలం ప్రారంభంలోనే సన్నద్ధమవుతాయి. ఈఏడాది ఇప్పటి వరకూ మలేరియా విభాగ అధికారులు కనీసం ఫాగింగ్‌ చేయడానికి ముందుకురాని దుస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా సబ్‌ప్లాన్‌ మండలాల్లో డెంగ్యూ విజృంభిస్తున్న విషయం విదితమే. అడపాదడపా కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈఏడాది వర్షాలు జూన్‌ మొదటివారం నుంచే ఆశిం చిన విధంగా కురుస్తున్నాయి. దీంతో ఉధృతంగా ఫాగింగ్‌తోపాటు పారిశుధ్య పనులు చేయాల్సి ఉంది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లక్షలాది రూపాయలతో కొనుగోలుచేసిన 20 ఫాగింగ్‌ యంత్రాలు మలేరియా విభాగం కార్యాలయంలో నిరుప యోగంగా పడిఉన్నాయి. సీతంపేట, మంద స, హిరమండలం, భామిని, కొత్తూరు. పాతపట్నం, మెళియాపుట్టి మండ లాల్లో ఈ యంత్రాలతో ఫాగింగ్‌ చేయాల్సి ఉంది. పంచాయతీల్లో పంపిణీ చేసి మలాఽథియన్‌ పిచికారీ జరిగేలా అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ఫాగింగ్‌ యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకో వల్సిన మలేరియా విభాగం సిబ్బంది చోద్యంచూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. కాగా ఫాగింగ్‌ యంత్రాల నిర్వహణ బాధ్యతను ఆయా పంచాయతీ లు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి వీర్రాజు ఆంధ్రజ్యోతికి తెలిపారు.


Updated Date - 2021-08-01T05:56:56+05:30 IST