Advertisement
Advertisement
Abn logo
Advertisement

దర తగ్గింపుపై పత్తి రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 27: జిల్లా కేంద్రంలో పత్తి ధర తగ్గింపుపై అన్నదాతలు ఆందోళన చేశారు. శుక్రవారం పత్తి ధర రూ.8130 ఉండగా ఒక్క రోజులోనే రూ.170 తగ్గించడంపై రైతులు ఆందోళన చేశారు. ఉదయం మార్కెట్‌కు పత్తి తీసుకొచ్చిన రైతులు ధర తగ్గింపుపై మార్కెట్‌ గేటును మూసి వేశారు. ధర తగ్గించడం సరికాదని ఆం దోళన చేశారు. మార్కెట్‌ అధికారులు, జిన్నింగ్‌ వ్యాపారస్థులు కుమ్మకై అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉదయం 11గంటల నుంచి నిరసన చేపట్టిన అన్నదాతలు ఎంతకు కొనుగోళ్లు ప్రారంభించక పోవడంతో తగ్గిన పత్తి ధరను వెంటనే పెంచి పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే ధర తగ్గింపు జిన్నింగ్‌ వ్యాపారస్థులను నిలదీసిన అన్నదాతలు వారు పట్టించుకోక పోవడంతో కిసాన్‌చౌక్‌కు ర్యాలీగా తరలివచ్చారు. జిల్లా కలెక్టర్‌ వెంటనే రావాలని సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సుమారు 3గంటల పాటు రాస్తారోకో కొనసాగడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచి పోయాయి. దీంతో ఆర్డీవో రాజేశ్వర్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావులు ఆందోళన విరమించాలని కోరినా,, ఆందోళన విరమించేది లేదని రైతులు బీష్మించుకుని కూర్చున్నారు. దీంతో చేసేదేమి లేక జిన్నింగ్‌ వ్యాపారులతో అధికారులు మాట్లాడి క్వింటాల్‌ పత్తికి రూ.8వేలు నిర్ణయించారు. ఽ  

కాగా, మార్కెట్‌లో పత్తి ధర ఒకే రోజులో రూ.8వేల130 నుంచి రూ.170 తగ్గించి రూ.7960లకు నిర్ణయించడంతో ఆవేదనకు గురైన ఓ రైతు స్థానిక కిసాన్‌చౌక్‌లో డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకుని రైతును వారించారు.  

Advertisement
Advertisement