పత్తి ధర పైపైకి..!

ABN , First Publish Date - 2022-01-20T06:09:15+05:30 IST

తెల్లబంగారంగా పిలుచుకునే పత్తి అన్నదాతకు సిరులు కురిపిస్తోంది. కొద్దిరోజుల నుంచి క్వింటాలు పత్తి రూ. 9వేలకు పైగా ధర పలుకుతూ వస్తోంది. తాజాగా బుధవారం భైం సా మార్కెట్‌లో క్వింటాలు పత్తి ధర రికార్డుస్థాయిలో రూ.9900లకు చే రుకోవడం పట్ల అన్నదాతలు ఆనందంతో పాటు ఆశ్చర్యమూ వ్యక్తం చే స్తున్నారు. ఈ ఏడాది పత్తి కొనుగోలు వ్యవహారంలో రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కయ్యారు. గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఏర్పడి సిండికేట్‌గా అవతారమెత్తేవారు. దీంతో ధరను కాటన్‌ సిండికేట్‌ శాసించేది. ఒక దశలో సీసీఐని సైతం ఈ కాటన్‌ సిండికేట్‌ తన గుప్పిట్లోకి తీసుకొని రైతన్న ఆదాయానికి గండి కొట్టేదన్న విమర్శలున్నాయి. సీసీఐ కొనుగోళ్ల విషయంలో క్రియాశీలకం అయిన కారణంగా ప్రైవేటు పత్తి వ్యాపారుల ఆగడాలకు కొంతమేర అడ్డుకట్ట పడింది.

పత్తి ధర పైపైకి..!
భైంసా మార్కెట్‌ యార్డుకు రైతులు తీసుకువచ్చిన పత్తి

భైంసా మార్కెట్‌లో రికార్డుస్థాయి ధర  క్వింటాలుకు రూ.9,900 

దిగుబడి తగ్గడమే కారణమంటున్న రైతులు 

సీసీఐ చేతులేత్తేసినా.. కొనుగోళ్లకు వ్యాపారుల మొగ్గు 

నిర్మల్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెల్లబంగారంగా పిలుచుకునే పత్తి అన్నదాతకు సిరులు కురిపిస్తోంది. కొద్దిరోజుల నుంచి క్వింటాలు పత్తి రూ. 9వేలకు పైగా ధర పలుకుతూ వస్తోంది. తాజాగా బుధవారం భైం సా మార్కెట్‌లో క్వింటాలు పత్తి ధర రికార్డుస్థాయిలో రూ.9900లకు చే రుకోవడం పట్ల అన్నదాతలు ఆనందంతో పాటు ఆశ్చర్యమూ వ్యక్తం చే స్తున్నారు. ఈ ఏడాది పత్తి కొనుగోలు వ్యవహారంలో రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కయ్యారు. గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఏర్పడి సిండికేట్‌గా అవతారమెత్తేవారు. దీంతో ధరను కాటన్‌ సిండికేట్‌ శాసించేది. ఒక దశలో సీసీఐని సైతం ఈ కాటన్‌ సిండికేట్‌ తన గుప్పిట్లోకి తీసుకొని రైతన్న ఆదాయానికి గండి కొట్టేదన్న విమర్శలున్నాయి. సీసీఐ కొనుగోళ్ల విషయంలో క్రియాశీలకం అయిన కారణంగా ప్రైవేటు పత్తి వ్యాపారుల ఆగడాలకు కొంతమేర అడ్డుకట్ట పడింది. 

నిర్మల్‌, భైంసా ప్రాంతాల్లో.. 

జిల్లాలోని నిర్మల్‌, భైంసా ప్రాంతాల్లో ప్రైవేటు వ్యాపారులు ప్రతిఏ డాది పత్తిని కొనుగోలు చేస్తున్నప్పటికీ.. సీసీఐ కొనుగోలు కేంద్రాల కారణంగా ధర విషయంలో అంతగా పోటీ ఉండేది కాదు. అయితే ఈ యే డు సీసీఐ పత్తి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. చివరకు ప్రైవేటు వ్యాపారు లే రంగంలోకి దిగి రైతులు ఆశించిన ధరను చెల్లిస్తుండడంతో సీసీఐ ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ధర క్వింటాలుకు రూ. 9వేలకు పైగా వ్యాపారులు చెల్లిస్తుండడంతో.. మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. తాజాగా రూ.9900లకు చే రడంతో అన్నదాతల మొహంలో చిరునవ్వు కనిపిస్తోంది. 

జిల్లావ్యాప్తంగా 1.59 లక్షల ఎకరాల్లో పంట

ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 1.59 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా.. 4.50లక్షల క్వింటాళ్ల కొనుగోలు లక్ష్యంగా నిర్ధారించారు. ఇప్పటివరకు 1.20లక్షల క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. దిగుబడులు తగ్గడం.. రైతుల వద్ద పత్తి నిల్వలు లేకపోవడంతో.. డి మాండ్‌ ఎక్కువ అవుతోంది. 

తగ్గిన దిగుబడి 

ఈసారి వరద లు, అకాల వర్షా ల కారణంగా పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఈ ఏ డాది 1.59లక్షల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేసినప్పటికీ ది గుబడులు తగ్గిపోయాయి. ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల మేర దిగుబడులు సాధారణంగా వస్తుంటాయి. అలాంటిది ఈసారి ఎకరానికి రెం డు, మూడు క్వింటాళ్ల దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం 1.59 లక్షల ఎకరాల్లో పంట సా గైన కారణంగా 4.50 లక్షల క్వింటాళ్ల వరకు పంటను కొనుగోలు చేసే అవసరం ఏర్పడుతుందని ఆశించారు. దీనికి అనుగుణంగానే ప్రైవేటు వ్యాపారులతో ఎప్పటికప్పుడు చర్చించి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. దిగుబడులు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు వచ్చిన కొంత మేర దిగుబడిని ప్రైవేటు వ్యాపారుల వద్దకు తీసుకువస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు పత్తిని తీ సుకురావాలంటూ   రైతులను కోరుతున్నప్పటికీ.. తమ వద్ద కొంతమేరకే పత్తి ఉందని వాపోతున్నారు. దీంతో పత్తికి డిమాండ్‌ మరింతగా పె రుగుతుందని చెబుతున్నారు. 

చేతులేత్తేసిన సీసీఐ

అనూహ్యంగా సీసీఐ పత్తి పంటను కొనుగోలు చేయలేమని చేతులెత్తేయడంతో ఆ పంటను పండించిన రైతులు మొదట్లో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గత సంవత్సరం సీసీఐ జిల్లాలో మొత్తం 7.50లక్షల క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేసింది. మద్దతు ధర రూ.5800లను చెల్లించింది. ప్రైవేటు వ్యాపారులు సైతం మొదట్లో రూ. 5000 నుంచి రూ. 5200వరకు చెల్లించారు. రైతులు తమ పంటనంతా ఎక్కువ మొత్తంలో సీసీఐకే విక్రయించారు. అయితే ఈసారి సీసీఐ ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వం సైతం మద్దతు ధరను ప్రకటించని కారణంగా రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కయ్యారు. అయితే  ప్రైవేటు వ్యాపారులపై ప్రతియేటా విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రైతులు మొదట్లో ప్రైవేటు కొనుగోళ్లపై భయపడ్డారు. ముఖ్యంగా తూకం, నాణ్యతతో పాటు ధర విషయంలోనూ ప్రైవేటు వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారన్న భావన ఉండేది. ఈ సారి మాత్రం ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి పత్తిని ఆసక్తిగా కొనుగోలు చేయడమే కాకుండా ధర విషయంలో సైతం దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు పత్తి రైతుకు ఊరటనిస్తున్నప్పటికీ.. గణనీయంగా తగ్గిన దిగుబడుల కారణంగా అన్నదాతలు కుంగిపోతున్నారు.

మార్కెట్‌లో పెరిగిన డిమాండ్‌..

జిల్లాలో ఈ ఏడాది వరి, మొక్క జొన్న పంటపై ఆంక్షలు విధించినప్పటికీ ప్రభుత్వం పత్తి పంట సాగును ప్రోత్సహించింది. అంతర్జాతీయ మా ర్కెట్‌లో ఇక్కడి పత్తి నాణ్యతకు ఎక్కువ డిమాండ్‌ ఉన్న కారణంగా సా గు లక్ష్యాన్ని కొంతమేర పెంచింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పెద్ద మొత్తంలో పంటను సాగు చేశారు. మూలిగే నక్కపై తాటికా య పడ్డ చందంగా రైతులను అకాల వర్షాలు ముంచేశాయి. రైతులు ఊహించిన దాని కన్నా భిన్నంగా దిగుబడులు రావడంతో కుంగిపోయారు. దిగుబడులు తగ్గిపోవడంతో డిమాండ్‌ పెరిగింది. డిమాండ్‌కు అను గుణంగా కొనుగోళ్లు జరగడం లేదంటున్నారు. బహిరంగా మార్కెట్‌లో పత్తి వ్యాపారులు మాత్రం క్వింటాలుకు రూ. 9900 వరకు ధరను చెల్లిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 

Updated Date - 2022-01-20T06:09:15+05:30 IST