పత్తి తూకంలో మోసం

ABN , First Publish Date - 2020-02-28T11:41:21+05:30 IST

పత్తి తూకంలో జిన్నింగ్‌ మిల్లు యజమానులు మోసానికి పాల్పడు తూ రైతులను ముంచుతున్నారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన భైరి సతీష్‌ గురువారం పత్తి వి క్రయించేందుకు వాహనంలో

పత్తి తూకంలో మోసం

పెద్దపల్లిటౌన్‌, ఫిబ్రవరి 27 : పత్తి తూకంలో జిన్నింగ్‌ మిల్లు యజమానులు మోసానికి పాల్పడు తూ రైతులను ముంచుతున్నారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన భైరి సతీష్‌ గురువారం పత్తి వి క్రయించేందుకు వాహనంలో లోడ్‌చేసుకొని రంగం పల్లి పద్మ ధర్మకాంట వద్ద తూకం వేయించాడు. 23 క్వింటాళ్ళ40 కిలోల పత్తి ఉన్నట్లు రసీదు ఇచ్చా రు. గొల్లపల్లి పరమేశ్వర కాటన్‌ మిల్లుకు అమ్మేం దుకు తీసుకెళ్ళాడు. అక్కడ పత్తి కాంటా వేయగా కేవలం 20 క్వింటాళ్లు ఉన్నట్లు చూపించింది. దీంతో రైతు, మిల్‌ యజమాని రాజ్‌కుమార్‌కు వాగ్వాదం జరిగింది. వేరే మిల్‌ వద్దకు తన మనషులను ఇచ్చి తూకానికి పంపించాడు. అక్కడ 23 క్వింటాళ్ళ 50 కేజీల పత్తి వచ్చింది. సదరు రైతు జిన్నింగ్‌ మిల్‌ వద్దకు వచ్చి వివరించాడు. నీ పత్తితో తేమ శాతం ఎక్కువ ఉంది కొననంటూ మిల్లుయజమాని మొం డికేశాడు. సీసీఐ అధికారులకు జరిగిన సంగతిని రైతు వివరించాడు. మిల్లు వద్దకు చేరుకున్న అధికా రులు పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు. 9 శాతం వచ్చింది. నాణ్యత గల పత్తిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. యజమాని పొంతన లేని సమాధనం చెపుతూ సుమారు రెండు గంటల పాటు రైతును సతాయించుకొని కింటాల్‌ పత్తికి 3 కేజీల పత్తి కటింగ్‌ చేసి తీసుకుంటానని యజమా ని పేర్కొన్నాడు. రైతులు పెద్ద ఎత్తున్న పోగవ్వడం తో పరిస్థితిని గమనించి వెనక్కితగ్గి పత్తిని కొను గోలు చేశాడు. 

Updated Date - 2020-02-28T11:41:21+05:30 IST