ఆసీస్ టూర్‌ జట్టు ఎంపిక రోజు.. సూర్యకుమార్ యాదవ్ ఫీలింగ్స్

ABN , First Publish Date - 2020-11-22T01:13:07+05:30 IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్.. కచ్చితంగా ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే భారత జట్టులో ఉంటాడనే అందరూ భావించారు.

ఆసీస్ టూర్‌ జట్టు ఎంపిక రోజు.. సూర్యకుమార్ యాదవ్ ఫీలింగ్స్

ముంబై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్.. కచ్చితంగా ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే భారత జట్టులో ఉంటాడనే అందరూ భావించారు. సూర్యకుమార్ కూడా అలానే అనుకున్నాడట. కానీ తన పేరు భారత జట్టులో లేకపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యాడట. ఎంతలా బాధపడ్డాడంటే.. ఆరోజు కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాడంట. ఈ విషయాన్ని సూర్యకుమార్ స్వయంగా వెల్లడించాడు. ‘‘నేను ఈసారి కచ్చితంగా సెలెక్ట్ అవుతాననే అనుకున్నా. అలా జరగకపోయే సరికి చాలా బాధపడ్డా. భారత జట్టు లిస్టులో నా పేరు లేకపోవడంతో కుంగిపోయా. ఆరోజు కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా మనసురాలేదు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా కష్టపడ్డా’ అని సూర్యకుమార్ చెప్పాడు.

Updated Date - 2020-11-22T01:13:07+05:30 IST