ప్రారంభమైన డైట్‌ సెట్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-12-04T04:35:54+05:30 IST

రాయచోటి పట్టణంలోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్‌)లో గురువారం నుంచి డైట్‌ సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.

ప్రారంభమైన డైట్‌ సెట్‌ కౌన్సెలింగ్‌

రాయచోటిటౌన్‌, డిసెంబరు3: రాయచోటి పట్టణంలోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్‌)లో గురువారం నుంచి డైట్‌ సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. డీవైఈఓ రంగారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. మొదటి విడతగా ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని, కడప జిల్లాకు కేటాయించిన 317 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారని ఆయన తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు జత చేసి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్‌ ఫీజు రూ.2,385, ప్రైవేటు కళాశాలలో అడ్మిషన్‌ ఫీజు రూ.12,500 ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజేంద్రప్రసాద్‌, ఓబుల్‌రెడ్డి, నాగేశ్వరరావు, నాగరాజు, రెడ్డెయ్య, వెంకటేశ్వర్లు, అసదుల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:35:54+05:30 IST