Abn logo
Oct 24 2021 @ 23:39PM

నేటి నుంచే కౌన్సెలింగ్‌

కౌన్సిలింగ్‌కు హాజరైన విద్యార్థులు (పాతచిత్రం)

ఇంజనీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

ఆన్‌లైన్‌లోనే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ఒకటో తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం

అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్‌ కేంద్రాల ఏర్పాటు


గుంటూరు(విద్య), అక్టోబరు 24: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశా లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఎంతోకాలంగా నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థు లు కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీ లన ప్రారంభం కానుంది. విద్యార్థులు ప్రాసెసింగ్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి హాల్‌టికెట్‌  నంబర్‌,  పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయ గానే వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. సైట్‌లో అడిగే సర్టిఫికెట్లు అన్ని ఆన్‌ లైన్‌లోనే అప్‌లోడు చేయాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో సర్టిఫికెట్స్‌ పరిశీలన పూర్తికాగానే విద్యార్థులు ఇచ్చిన సెల్‌ నంబర్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఈ ప్రక్రియలో ఎవైనా సందేహాలు ఉంటే తప్పించి విద్యార్థులు సహాయ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని నల్లపాడులోని ఎంబీటీఎస్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌,  ఎంసెట్‌  కౌన్సెలింగ్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ రమాదేవి  సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 31 వరకు జరుగుతుందన్నారు. జిల్లా విద్యార్థులకు హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నరసరా వుపేటలోని జేఎన్‌టీయూ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. 


అప్రమత్తంగా ఉండాలి

ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలనలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని రమాదేవి తెలిపారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ పూర్తి అయ్యే వరకు ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఎటువంటి సందేహాలు ఉన్నా హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సంప్రదించవచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ కమ్‌ ప్రాసెసింగ్‌ ఫీజు కింద ఒసీ, బీసీ విద్యార్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చెల్లించాలి. చెల్లింపు, ఇతర వివరాల కోసం జ్ట్టిఞట://టఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ అనే వెబ్‌సైట్‌లో చూడాలి. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, సైనిక ఉద్యోగుల పిల్లలకు ఈ నెల 27 నుంచి ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన ఆన్‌లైన్‌లో ఉంటుంది. వీరు కూడా సందేహాలు నివృత్తి కోసం హెల్ప్‌లైన్‌ కేంద్రాల్ని సంప్రదిం చవచ్చు. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత నవంబరు 1 నుంచి 5వ తేదీ వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కళాశాలల్లో సీట్లు ఎంచుకునే అవకాశం కల్పించారు. వెబ్‌ఆప్షన్‌ మార్చుకునే అవకాశం నవంబరు 6న ఇచ్చారు. విద్యార్థులకు కళాశాలల్లో సీట్లు నవంబరు 10న కేటాయి స్తారు. తరువాత 15వ తేదీ వరకు విద్యార్థులు ఎంపిక చేసుకున్న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.